ఎపిసోడ్ 3 - నీడలో దాగి ఉన్న నిజం"వెల్ కమ్ టు మై వరల్డ్, మేఘన..."ఆ మాటలు గాలిలో పూర్తిగా కలవకముందే, నల్లటి ఆకాశాన్ని చీల్చుకుంటూ ఉరుము ఒక్కసారిగా విరుచుకుపడింది. ఆద్విక్ కుడిచేతిలో నిగనిగలాడుతున్న ఆ నల్లటి మృత్యుాయుధం, ఆ చినుకుల తాకిడికి తడిసిముద్దై, వీధి దీపాల మసక వెలుతురులో యముడి పాశంలా భయంకరంగా మెరుస్తోంది. మేఘన గుండెలో ఇప్పుడు రక్తం ప్రవహించడం లేదు, కేవలం భయం మాత్రమే పరుగులు తీస్తోంది.రైలు చక్రాల చప్పుడులా వినిపిస్తున్న ఆమె హృదయ స్పందన, ఆమె చెవులను గట్టిగా బాదేస్తోంది. ఆమె కనురెప్పలు వాల్చడం మరిచిపోయి, ఆద్విక్ చేతిలో ఉన్న గన్ వైపే స్థాణువులా చూస్తున్నాయి. నిన్నటి వరకు చేతిలో ఒక కాఫీ కప్పు పట్టుకుని, ఎంతో సౌమ్యంగా, చిరునవ్వుతో కనిపించిన ఆద్విక్... ఈరోజు ఒక మనిషి ప్రాణాలు తీసే ఆయుధాన్ని అంత అలవోకగా ఎలా పట్టుకోగలిగాడు? అసలు ఇతను తను తెలిసిన ఆద్వికేనా?"కదలకు..." ఆద్విక్