మరణ శాసనం లిఖిస్తే... మరణం తప్పదా? - 2

(610)
  • 2.7k
  • 1.1k

సమయం ఆరు గంటలు... గడిచిపోయాయి.పోలీసులు, ఆనందరావు మనుషులు నగరమంతా వెతికినా కార్తీక్, సుమ ల ఆచూకీ తెలియ రాలేదు. కిడ్నాపర్లు సుమను తీసుకువెళ్లే సమయంలోనే సుమ యొక్క ఫోను ఎక్కడో పడిపోయింది, కావున ఎటువంటి సమాచారం లేదు.   ఇంత లోపల ఆనందరావు బావమరిది రాజారావు మరియు అతని కూతురు సత్యభామ కూడా వచ్చారు. సత్య సుమ కంటే మూడేళ్లు పెద్దది అయినా వివాహం చేసుకోలేదు. సత్య తన తండ్రి మాట ఎప్పుడూ వింటుంది కానీ పెళ్లి విషయంలో మాత్రం ఎవరి మాటా వినడం లేదు. ఎందుకో పెళ్లి చేసుకోవడం లేదు. సత్యకు అందం, ఆస్తిపాస్తులు ఉన్నాయి. ఎందరో పెళ్ళికొడుకులు పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చినా సత్య వారందరినీ తిరస్కరిస్తూనే ఉంది. ఆనందరావును సుభద్రను ఓదారుస్తూ ఉండగా.. పనిమనిషి హేమ పరిగెత్తుకుంటూ వచ్చి, సుమ వస్తోంది అని చెప్పింది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆనందరావు, సుభద్ర, సురేంద్ర సుమకు ఎదురుగా వెళ్లి, " ఇంతసేపు