అలా వారం రోజులు గడిచిపోయాయి. ఒకరోజు ఆనందరావు, సత్య కలిసి ఒక రెస్టారెంట్ కు వెళ్లారు. అది నగరంలోనే ఖరీదైనది మరియు ధనవంతులు వెళ్లేది. వారు లోపలికి వెళ్లే దారిలో కార్తీక్ కనిపించాడు. చాలా ఖరీదైన దుస్తులు ధరించి ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. అతను సూట్ ధరించి ఉన్నాడు. కార్తీక్ చెప్పే మాటలు వింటూ ఉన్నాడు. ఆనందరావు కార్తీక్ ను పలకరించగానే సూటు ధరించిన వ్యక్తి, కార్తీక్ వైపు చూసి వెళ్తాను అన్నట్టుగా సైగ చేసి వెళ్ళిపోయాడు. ఆనందరావు, సత్యలు కార్తీక్ ఎదురుగా కూర్చున్నారు. కుశల ప్రశ్నలు అయిపోయాక ఆనందరావు " కార్తీక్ ఎలా ఉన్నావు? గాయం తగ్గిందా? ఇక్కడ ఎవరి కోసం వచ్చావు? ఆయన ఎవరు? " అని అడిగాడు. అప్పుడు కార్తీక్, " గాయం చాలా వరకు తగ్గిపోయింది. సుమ బాగానే ఉంది కదా? తెలిసిన మనిషితో మాట్లాడడానికి వచ్చాను "అని చెబుతుండగా.... ఆనందరావు ఫోన్ మోగింది. "ఇది