Akhira - A tale of presence - 12 in Telugu Drama by Sangeetha Pushpa books and stories PDF | అఖిరా – ఒక ఉనికి కథ - 12

Featured Books
Categories
Share

అఖిరా – ఒక ఉనికి కథ - 12

ఎపిసోడ్ 12

అఖిరా కాలేజ్‌లో అభయ్‌ని కలుస్తుంది. ఇద్దరి చూపులు కలుస్తాయి కానీ మాటలు రావు.
అప్పుడే మెల్లగా అఖిరా,
“నేను వైభవ్‌తో మాట్లాడాను అభయ్. I think he won’t come back,” అని అన్నది.

అభయ్ ఒక చిన్న నవ్వుతో,
“I wish,” అని చెప్పాడు.
అఖిరాకు ఏమి అర్థం కాలేదు.
“సరే, నాకు క్లాస్‌కి టైం అవుతోంది. ఈవెనింగ్ కలుద్దాం, బై,” అని అన్నది.
అభయ్,
“సరే, will meet later, bye,” అని చెప్పి ఇద్దరూ వెళ్లారు.

వైభవ్ ఆఫీస్‌కి వెళ్లకుండా ఇంటికి వెళ్లి తన గదిలో తనను తాను లాక్ చేసుకుని, అఖిరా చెప్పిన మాటలే మళ్లీ మళ్లీ ఆలోచిస్తూ ఉన్నాడు. తన గతం తనకి మళ్లీ మళ్లీ గుర్తొస్తుంది.
ఆ గతం వల్ల తను ఎంత ఒంటరివాడయ్యాడో, ఏం కోల్పోయాడో అన్నీ ఒక్కసారిగా తలుచుకుంటున్నాడు.

ఇటు కాలేజ్ క్యాంటీన్‌లో సత్య,
“ఏంటి, ఎలా ఉన్నావ్?” అని అడిగింది.
అఖిరా,
“ఇప్పుడే వచ్చాను, నేను బానే ఉన్నాను. నువ్వు ఎలా ఉన్నావ్?” అని అడిగింది.
“I am good,” అని నవ్వుతూ సత్య చెప్పింది.
“ఇంకేంటి, ఏమి జరుగుతుంది నీ లైఫ్‌లో? అంతా ఓకేనా?” అని అడిగింది.
అఖిరా కొంచెం ఆలోచించి,
“ఏమో… వైభవ్‌తో మోర్నింగ్ మాట్లాడాను. ఫస్ట్ టైమ్ ఏమి ఎదురు సమాధానం చెప్పకుండా నా మాటలు విని వెళ్లిపోయాడు. కానీ అతని కళ్లలో ఏదో బాధ చూసినట్టు అనిపించింది,” అని అన్నది.
సత్య,
“అతని గురించి నువ్వు ఎందుకు ఇంత ఆలోచిస్తున్నావ్? ఇక నీ జోలికి రాడు. నువ్వు నీ కాన్సంట్రేషన్ అభయ్ మీద పెట్టు,” అని చెప్పింది.
“సరే సరే,” అని అఖిరా విసుగ్గా అన్నది.

ఇంతలో పిన్ని ఫోన్ వచ్చింది.
“హలో, చెప్పు పిన్ని,” అని అఖిరా అన్నగానే, అటు వైపు నుంచి ఏడుపు.
“అఖిరా… త్వరగా ఇంటికి రావే… నీ చెల్లెలు…” అని పిన్ని ఏడుస్తూ మాట్లాడింది.
అఖిరా గుండె దగ్గర ఒక్కసారిగా దిగింది.
“ఏమైంది పిన్ని? నిక్కీకి ఏమైంది?” అని అడిగింది.
“తను నాకేం చెప్పట్లేదు… నువ్వే వచ్చి అడుగు,” అని పిన్ని అన్నది.
“సరే, నేను ఇప్పుడే వస్తున్నాను,” అని చెప్పి కాల్ కట్ చేసింది.
సత్యతో,
“నేను వెళ్లాలి, something urgent. బై,” అని చెప్పి బయలుదేరింది.

అఖిరా కంగారుగా ఇంటికి వచ్చింది. హాల్‌లో నిక్కీ కళ్లలో కన్నీళ్లతో కూర్చుని ఉంది.
“అక్కా…” అని పిలిచింది.
అఖిరా వెంటనే వెళ్లి గట్టిగా కౌగిలించుకుంది. నిక్కీ ఏడుపు ఇంకా పెరిగింది.
అఖిరా మెల్లగా,
“ఏం జరిగింది నిక్కీ… చెప్పు,” అని అడిగింది.
నిక్కీ కొంచెం కామ్ అయి కళ్లను తుడుచుకుంది… కానీ మాటలు రాలేదు.
అఖిరా మళ్లీ,
“ఏం ఉన్నా సరే, భయపడకుండా చెప్పు. నేను ఉన్నా,” అని అన్నది.

నిక్కీ నెమ్మదిగా మాట్లాడడం మొదలు పెట్టింది.
“అక్కా… నేను ఈరోజు కాలేజ్ నుంచి వస్తుంటే… నా వెనక కొన్ని రోజులు నుంచి ఫాలో అవుతున్న ఒక అబ్బాయి మళ్లీ వచ్చాడు…”
“ఫస్ట్‌లో ఇగ్నోర్ చేసాను… కానీ ఈరోజు మాత్రం నన్ను ఆపి మాట్లాడడానికి ట్రై చేశాడు…”
అఖిరా కళ్ళు సీరియస్‌గా మారాయి.
“నేను వాడిని అవాయిడ్ చేసి వెళ్లిపోవాలి అనుకున్నా… కానీ అతను నా చెయ్యి పట్టుకుని ఫోర్స్ చేశాడు అక్కా…”
అఖిరాకు కోపం పెరిగింది.
“నేను భయపడి గట్టిగా చెయ్యి విడిపించి అక్కడినుంచి వచ్చేసా…”
కొంచెం ఆగి నిక్కీ మళ్లీ అన్నది:
“కానీ అక్కా… వెళ్లిపోయే ముందు అతను చెప్పాడు…”
అఖిరా టెన్షన్‌తో,
“ఏం చెప్పాడు?” అని అడిగింది.
నిక్కీ భయంగా,
“‘నువ్వు ఇలా అవాయిడ్ చేస్తే… నేను నిన్ను వదలను… నీ గురించి నాకు తెలియని విషయాలు లేవు…’ అని అన్నాడు అక్కా…”
ఆ మాటలు వినగానే తన గుండె వేగంగా అడగడం మొదలైంది.
“నాకు చాలా భయం గా ఉంది అక్కా… రేపు కాలేజ్‌కి వెళ్లాలంటే కూడా భయం వేస్తోంది,” అని నిక్కీ మళ్లీ ఏడుస్తుంది.

అఖిరా తన భయాన్ని లోపల పెట్టుకుని నిక్కీని టైట్‌గా పట్టుకుని,
“హే… నేను ఉన్నా కదా. నీకు ఏమీ అవ్వదు,” అని ధైర్యం ఇచ్చింది.
తరువాత పిన్ని దగ్గరికి వెళ్లి,
“నువ్వు కంగారు పడకు పిన్ని. నిక్కీని నేను చూసుకుంటాను,” అని అన్నది.
పిన్ని ఇక ఏమి చెప్పకుండా సరే జాగ్రత్త అని చెప్పింది.

అఖిరా టెర్రస్ మీదకి వెళ్లి అభయ్‌కి కాల్ చేసింది.
రింగ్‌టోన్ వినగానే తనకు తెలియకుండా నవ్వింది.
కాల్ లిఫ్ట్ అయ్యింది.
“హలో…” అని అభయ్ వాయిస్.
అఖిరా కొంచెం సైలెన్స్‌లో ఉంది.
“హలో…” అని మళ్లీ పిలిచాడు.
“అఖిరా…” అని ప్రేమగా పిలిచాడు.
అఖిరాకు సంతోషం కలిగింది కానీ కంట్రోల్ చేసుకుని,
“అభయ్…” అని మెల్లగా పిలిచింది.
“చెప్పు, ఏంటి కాల్ చేశావ్? అయినా నా నంబర్ ఎలా దొరికింది?” అని అడిగాడు.
అఖిరా,
“దొరికింది కదా, అది చాలదా?” అని అన్నది.
అభయ్ నవ్వాడు.
“సరిపోతుంది,” అని అన్నాడు.
“ఇంకా ఏంటి విషయం?” అని అడిగాడు.
అఖిరా,
“ఒక చిన్న హెల్ప్ కావాలి అభయ్… రేపు కాలేజ్ అయ్యాక నాతో వస్తావా?” అని అడిగింది.
అభయ్ కొంచెం డౌట్‌తో,
“ఎక్కడికి?” అని అడిగాడు.
“అది రేపు చెప్తాను… కాలేజ్ అయిపోయాక మెయిన్ గేట్ దగ్గర ఉంటాను. వచ్చేయ్,” అని అన్నది.
అభయ్,
“సరే, వస్తాను,” అని చెప్పి కాల్ కట్ చేశాడు.
అఖిరా కొంచెం నవ్వుకుని,
“బిజీగా ఉన్నాడేమో…” అని అనుకుని కిందకి వెళ్లిపోయింది.

రాత్రి అఖిరా నిక్కీ రూమ్‌కి వెళ్లింది.
నిక్కీ నిద్ర లేకుండా ఆలోచిస్తోంది.
“ఎందుకు ఇంకా ఆలోచిస్తున్నావ్?” అని అఖిరా అడిగింది.
నిక్కీ,
“నేను అనవసరంగా భయపడి నిన్ను భయపెట్టేసానేమో అనిపిస్తుంది అక్కా…” అని అన్నది.
“ఈ మ్యాటర్ ఇక్కడే ఆగదు నిక్కీ. ఎవ్వరైనా నిన్ను భయపెట్టడానికి ట్రై చేస్తే నేను చూస్తాను. నువ్వు భయపడకుండా ఉండు,” అని కొంచెం గట్టిగా అన్నది.
“రేపు ధైర్యంగా కాలేజ్‌కి వెళ్ళు. కాలేజ్ అయ్యాక నాకు కాల్ చేయ్. నేను వచ్చి నిన్ను పిక్ చేసుకుంటాను. ఆ అబ్బాయి ఎవరో చూపించు… నేను మాట్లాడుతాను,” అని చెప్పింది.
నిక్కీ,
“వద్దు అక్కా… మళ్లీ పెద్ద ప్రాబ్లమ్ అవుతుంది…” అని అన్నది.
అఖిరా,
“ఏం ప్రాబ్లమ్ కాదు. నేను ఉన్నా కదా. నువ్వు భయపడకు,” అని కాన్ఫిడెంట్‌గా చెప్పింది.

అఖిరా నవ్వుతూ,
“భయపడడం తప్పు కాదు నిక్కీ. కానీ ఆ భయాన్ని చూసి ఆగిపోవడం తప్పు. నువ్వు స్ట్రాంగ్‌గా ఉండాలి,” అని చెప్పింది.

అఖిరా తన గదికి వచ్చి పడుకోవడానికి ట్రై చేసింది.
కాని ప్రతి సారి కళ్ళు మూసినప్పుడు… వైభవ్ గుర్తొస్తున్నాడు.
అతని కళ్లలో చూసిన ఆ తెలియని బాధ… తన మనసులో తిరుగుతూనే ఉంది.

ముందుకు కొనసాగుతుంది…