MUNDHU JAGRATHA in Telugu Moral Stories by kvlsandhyarani books and stories PDF | ముందు జాగ్రత్త

Featured Books
Categories
Share

ముందు జాగ్రత్త

కొండంత ఆస్తి ఉన్నా కూర్చొని తింటే కరిగిపోతుంది

అనేది మన పెద్దలు చెప్పిన సామెత."

"ఏట్లో వేసినా ఎంచి వేయాలి అని మన పెద్దలు ఊరికే

అనలేదు."

   
     వరలక్ష్మి కి చిన్నతనములోనే పెళ్లి కుదిరింది. ఆమె

పెళ్లికి వాళ్ళ నాన్నగారు లేరు ,తన అన్నదమ్ములే

నడుము కట్టి ఆమెకు పెళ్లి చేశారు. ఆమె వయసు

దాదాపుగా ఒక 79 ఉంటాయి. స్వతహా చాలా

అమాయకురాలు ,అల్ప సంతోషి ,భూదేవికి ఉన్నంత

ఓర్పు ఈమెలో ఉన్నది. ఇంటికి వచ్చిన బంధువులు

గాని ,పిల్లల స్నేహితురాళ్ళను కానీ, చాలా బాగా

చూసుకునే వారు. ఈమెకు ఒక్కటే కోరిక తను

బ్రతికుండగానే వాళ్ల కేసు సెట్టిల్ అవ్వాలని దీనికోసం

ఆమె చెయ్యని నోములు వ్రతాలు లేవు, మొక్కని

దేవుడు లేడు. ఈ కేసు తన భర్త ఉండగా సెటిల్

అవుతుందని చాలా నమ్మకంగా ఉండేవారు. మనము

అనుకుంటూ ఉంటాం గానీ అసాధ్యాన్ని సుసాధ్యం

చేయగలమని, ఉదాహరణగా : ఒక ఆవిడ ఇలా

మనసులో అనుకున్నదట తన పుట్టే కూతురు/

కొడుకు ముక్కు సంపంగి మొగ్గలాగా ఉండాలని 

అనుకుందట, ఎందుకంటే వాళ్ళందరి ముక్కలు చాలా

  అందంగా ఉంటాయట .ఆ బ్రహ్మ మనిషిని తయారు

చేసేటప్పుడు మధ్యలో వదిలిపెట్టి వెళ్తే మనము ఏమి

చేయగలము? ఇదంతా ఒకప్పటి సంగతి అని

అనుకుంటున్నారా! ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ వచ్చిన

తర్వాత అదంతా సాధ్యమే అంటారా సరే నేను

అంగీకరిస్తున్నాను. కొందరు పుట్టుకతోనే పేద వాళ్ళ

లాగా పుడతారు కానీ ఆ పేదరికం ఎప్పటికీ పోదు ,

మరి కొంతమంది పుట్టుకతోనే చాలా ధనవంతులుగా

పుడతారు. ఇలా ఎందుకు జరుగుతుందంట?

అందరికీ అన్నీ ఉంటాయా? ఎవరి అదృష్టం వాళ్ళది

మనము ఇదంతా ఇక్కడే వదిలేసి కథను

కొనసాగిద్దామా ? కేసు మాత్రం ఇంకా సెటిల్ 

అవ్వలేదు.

ఆమెకి దిగులంతా అదే. నేను చనిపోయే లోపల

ఈ కేసు సెటిల్ అవుతుందా లేదా అని?

అక్షిత చాలా స్టైల్ గా ఉంటారు. "ఆమె రూటే సపరేటు

నెవ్వరు ట్రై టు కం ఇన్ దిస్ వే "అన్నట్లుగా ఉండేది
.

ఆమె చదువులో చాలా చురుకు ,ఐ క్యు లెవెల్స్ కూడా

ఎక్కువే. అప్పటి రోజుల్లో ఆమెను రమ్యకృష్ణ లా

ఉంది అనేవాళ్ళు. ఆమె చీర కట్టే స్టైల్, ఆమె చీరలు

సెలక్షన్ అంతా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. తన

చెల్లెలు అందరినీ బాగా చూసుకునేవారు. ఏ

విషయాన్ని అయినా ఇట్టే పసికట్టేసేది.అందుకే 

చుట్టాలు అందరూ అక్షితను సరదాగా సిఐడి

అంటారు. జయ చాలా అందంగా ఉండేది. ఆమెని

సావిత్రి అనేవారు . ఆమె కాలేజ్ కి వెళ్ళేటప్పుడు

స్నేహితురాళ్ళతో తప్ప ఒంటరిగా వెళ్ళేది కాదు.

చక్కగా పాటలు పాడేది. నిత్యకు ఇంటి పని , వంట



పని అన్ని బాగా వచ్చు . చాలా అందంగా


ఉంటుంది.అమ్మకు అన్నింటిలో బాగా సాయం చేసేది


. ఆదివారం వచ్చిందంటే ఒక్కతే మార్కెట్ కి వెళ్లి

కూరగాయలు, కావాల్సిన వస్తువులు అన్నీ తెచ్చేది.

అమ్మకు నిత్య అంటే చాలా ఇష్టము.
  
 
పూజిత చాలా చురుకైనది ,గొడవకు పెద్ద బాబు ఎవరి

దగ్గరైనా కొంచెం తేడా వచ్చిందో , అవతల వారిని

ఊరికే వదిలిపెట్టదు. వాళ్ల ఇంటికి ఎవ్వరూ వెళ్ళినా

భోజనం పెట్టకుండా పంపించేది కాదు. తనకి

తెలియని వంట లేదు. ఇంట్లో వారికి కూడా నాన్ వెజ్

కానీ వెజ్ కానీ చక్కగా వండి పెడుతుంది . తను చాలా

స్పీడు . భక్తి చాలా ఎక్కువ తనకు. ఎక్కడ గుడి ఉన్నా

అక్కడికి వెళ్లి పూజలు చేస్తుంది. రవి అందరికన్నా

చిన్నవాడు తన అక్క చెల్లెలు ఏమి చెప్తే అదే

వింటాడు. కష్టపడతాడు, అమాయకుడు,

మంచివాడు. రవి భార్య చక్కని చుక్క, మంచి పద్ధతి

గల అమ్మాయి. భర్తను బాగా చూసుకుంటుంది. 

ఇద్దరు దంపతులు ఉద్యోగాలు చేసుకుంటూ 

ఆనందంగా జీవిస్తున్నారు.

  సూర్యారావు గారు ఆ రోజుల్లో బి.ఏ ఇంగ్లీష్

లిటరేచర్ చేశారు. ఈయన అమ్మగారికి ఈయనతో

పాటు పదిమంది సంతానము. ఈయన చాలా

అందంగా ఉంటారు, బాగా తెలివైన వారు. తండ్రి


నరసయ్య గారు సూర్యారావు గారిని బాగా

చూసుకునేవారు. తల్లి ఈయన

దగ్గరే ఉండేది. చదువు పూర్తయిన తర్వాత చాలా

ఉద్యోగాలు అంది వచ్చాయి. ఈయన పెద్ద అక్కకు


మంచి సంబంధం వచ్చింది. తన అక్కకు దగ్గరుండి

పెళ్లి చేశారు. బావ ఆ రోజుల్లోనే ఇంజనీర్ గా

పనిచేస్తున్నారు. బావగారికి వ్యాపారం చేయాలని 

చాలా మక్కువ ఒక్కడే చేయడానికి ఉద్యోగరీత్యా

కుదరదు కాబట్టి సూర్యారావు గారిని పదేపదే

ప్రాధేయపడగా,

ఈ ఒప్పందానికి సరే అన్నారు. గుంటూరులో పొగాకు

కంపెనీని ప్రారంభించారు వీరు ఇరువురు. మొదట్లో

కొంచెం కష్టమైనను బండి కొంచెం గాడిలో పడటం

ప్రారంభించింది. వ్యాపారం నెమ్మదిగా స్పీడు

అందుకుంది . ఆయనకి నోట్లు కట్టలుగా రావడము

ఆరంభించింది. ఆయన అప్పుడప్పుడు విదేశాలకు


కూడా వెళ్లేవారు. వెళ్లినప్పుడల్లా వాళ్ళ పిల్లలకి మంచి

-మంచి బట్టలు తెచ్చేవారు, పెద్ద పెద్ద కారులో


తిరిగేవారు, విమానంలో విదేశాలకు వెళ్లేవారు. అది

ఒక రంగుల ప్రపంచం లా ఉండేది .

  
"ప్రవీణ్ కుమార్ సూర్యారావు గారి రెండో అక్క కొడుకు

బాగా చదువుకున్నారు. వాళ్ళ అమ్మ నాన్నకు లేక లేక

పుట్టాడు , గారాల పట్టి లాగా చూసుకునే వాళ్ళు.

నాన్న మారుతి అప్పుడే చాలా పెద్ద పదవిలో

ఉండేవారు. బాగా జాగ్రత్తపరుడు కూడా. ఆయన

కొనని ఆస్తి లేదు, భూమి లేదు, చాలా ఇల్లు కూడా

ఉన్నాయి. తల్లిదండ్రులు ఆరోగ్యరీత్యా తొందరగా

చనిపోయారు. ప్రవీణ్ కి అక్క చెల్లెలు, అన్నదమ్ములు

ఎవ్వరూ లేరు. కలెక్టర్ అవ్వాలని చాలా ట్రై చేశారు

చాలా అడ్డంకులు వచ్చి కోరిక తీరకుండా కట్టిపడే

సాయి.

అంటే ఏజ్ కూడా అయిపోయింది.

తరువాత ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు

ఐఐటి కాలేజీలు అతనిని వచ్చి క్లాసులు

తీసుకోమని అడిగినా, పెద్దగా ఇష్టపడేవారు కాదు.

ఆస్తిపాస్తులు ఉంటే సెక్యూరిటీగా

పనిచేస్తాయి. , కానీ అవే


ఖర్చు చేసుకొని పోతూ ఉంటే ఆస్తులు -పాస్తులు కరిగిపోతాయి.

  ఆస్తులు పోయి అప్పులు

పాలయ్యారు. పిల్లలను కనడానికి కూడా సంపాదించి

  అప్పుడు ప్లాన్ చేద్దాము అని అనుకున్నారు. ఈ

విధంగా రోజులు గడిచే కొద్ది అప్పుల బాధలు ఎక్కువ

అయ్యాయి. దీనితో ఆయనకు ఆరోగ్య సమస్యలు

తలెత్తాయి."

"కళ్యాణ్ తల్లితండ్రులు బెంగుళూరులో ఉండేవారు

వీళ్ళు ఇద్దరు అక్క చెల్లెలు ఇద్దరు అన్నదమ్ములు

. అందరూ బాగా చదువుకున్నారు. పెద్ద కొడుకు చాలా

పెద్ద పోస్టులో ఉన్నారు. బాగా తెలివిగలవారు

ముందు చూపు చాలా ఎక్కువ. ఏ రూపాయి ఎక్కడ

ఖర్చు చేయాలో బాగా తెలుసు. చాలా జాగ్రత్తగా

ఉంటారు. ఒక్క రూపాయి కూడా వేస్ట్ గా ఖర్చు

చేయరు. ఈయనకు నలుగురు పిల్లలు. అందరూ

ఆడపిల్లలే. అందర్నీ చక్కగా సెటిల్ చేశారు ."


  
"అర్జున్ మధ్యతరగతి పరివారానికి చెందినవాడు.


తనకి ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలియదు తన

భార్య, ముందు చూపుగా అతనికి ఫీడ్బ్యాక్ ఇస్తూ

ఉంటుంది . అర్జును చాలా కలగా ఉంటాడు. వీరికి

   ఇద్దరు పిల్లలు. తొందరగానే ,

చేతికి అంది వచ్చారు . ఇద్దరూ కష్టపడి మంచి

ఉద్యోగాలలో స్థిరపడ్డారు ."

 
" నాగేశ్వరావు గారికి నలుగురు అక్క చెల్లెలు,

అన్నదమ్ములు. ఎప్పుడు కలిసి-) మెలిసి

ఉంటారు ,టూర్లకు వెళుతూ ఉంటారు. నాగేశ్వరావు

గారి నాన్న గారిది చాలా పెద్ద ఉద్యోగము. ఈయన


పిల్లలకు చాలా ఆస్తులు ఏర్పాటు చేశారు.

నాగేశ్వరరావు గారు సిబిఐ డిపార్ట్మెంట్లో పని

చేస్తున్నారు. వీళ్ళకు ఇద్దరు ఆడపిల్లలు. నాగేశ్వర్

గారికి పిల్లలు అంటే పంచప్రాణాలు."

   "సూర్యారావు గారి బావగారు అకస్మాత్తుగా 

చనిపోయారు. ఈ సంఘటన జరిగిన తర్వాత కొన్ని రోజులకే
"
  పెద్ద సైక్లోన్ ఒకటి వచ్చి పొగాకు పంటను నాశనం చేసి ముంచేసింది."

"దీపము ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి

అంటారు కదా." సూర్యారావు గారి అక్క జాగ్రత్తగా

అంతకు ముందు వచ్చిన డబ్బులను ఎక్కడికక్కడ

కట్టుదిట్టం చేసి స్థలాలు , పొలాలు కొనుక్కున్నారు.

సూర్యారావు గారు కొనుక్కున్న స్థలాలని పొలాలను

అమ్మి వేశారు. ఆ డబ్బు కట్టలు ఉన్నప్పుడు అరే

నాకు పిల్లలు ఉన్నారే వాళ్ళ భవిష్యత్తు గురించి

ముందే ఆలోచించి పెట్టాలి అనే తెలివితేటలు లేవు.

తొందరపాటుతనముతో డబ్బులన్నీ ఖర్చు

అయిపోయినాయి. ఇప్పుడు వారు ఆ కంపెనీ

ఇన్సూరెన్స్ కోసము కోర్టులో కేసు వేశారు. అది ఒక

పట్టానా సెటిల్ అవ్వట్లేదు. ఈ లోపల అప్పులు

పాలయ్యారు. ఇలాగా ఆయన అదే దిగులుతో 

మంచం పట్టారు. మనకు ఒక 50,000 వస్తే మనము

కనీసము ఒక పదివేలైనా ఆదా చేయాలి కదా

" మనకు అనుకోని కష్టాలు ఎదురైతే మనము

అప్పుడు నిలదొక్కుకుంటాము."

  " వరలక్ష్మి గారు బ్రతికి ఉన్నప్పుడే కేసు సెట్టిల్

అయిపోయింది . "అందరూ ఆనందంగా ఉన్నారు. 

సంబరాలు అంబరాలను దాటాయి. చుట్టాల అందరూ

వాళ్ళ ఇంటికి వెళ్లి వరలక్ష్మి గారికి మనస్ఫూర్తిగా 

అభినందనలను తెలిపారు. ఈమె వచ్చిన డబ్బులను,

ఒక్క రూపాయి కూడా పాడు చేయకుండా బ్యాంకులో

కొంచెం వేసుకుని పిల్లల కోసం డిపాజిట్ చేసింది. ఆమె

దేవుడికి కోటి నమస్కారాలు చెప్పుకుంది.


   
"సూర్య రావు గారి భార్య వరలక్ష్మి "ఈ దంపతులకు

ఐదుగురు పిల్లలు వాళ్లలో నలుగురు -కూతుర్లు ఒక్క

కొడుకు. వీళ్ళందర్నీ పరిచయం చేస్తాను.


   
అక్షిత -ప్రవీణ్

కుమార్, జయ- కళ్యాణ్, నిత్య - అర్జున్, పూజిత -

నాగేశ్వరరావు, రవి -రమా


ఈ ఆది దంపతులకు వీళ్లు అందరూ అల్లుళ్ళు - కూతుర్లు. రవి -

రమా కొడుకు -కోడలు.

 
 

"డబ్బులు ఉన్నప్పుడే ఆచి తూచి అడుగులు వేయాలి"

లేకపోతే వచ్చే ప్రమాదాన్ని మనము ముందుగా

పసికట్టలేమని పెద్దలు అంటూ ఉంటారు."


                      "సర్వేజనా సుఖినోభవంతు లోకా   


సమస్తా సుఖినోభవంతు"