ఇంకా ఫ్యామిలీ విషయానికి వస్తే.....
ఇంటి పెద్ద ప్రతాప్ గారు అయన వైఫ్ జానకిగారు... వాళ్లకు ఒక కొడుకు రామ్ గారు (బిజినెస్ చేస్తారు).... వైఫ్ సీతగారు.....(హౌస్ వైఫ్)..వీళ్లకు ముగ్గురు పిల్లలు...
నీల్ కృష్ణ (పెద్ద కొడుకు... మన హీరో)...
వినయ్ కృష్ణ (చిన్న కొడుకు.. అన్నయ్య అంటే ప్రాణం )...
విషితా (హీరో గారి చెల్లలు...)....
చెప్పినట్టుగానే సరిగ్గా పదిహేను నిమిషాల్లో స్నానం ముగించేసి, తడి జుట్టుతోనే పరుగున బయటకు వచ్చాడు విన్ను... ముఖం మీద నీటి చుక్కలు పడుతున్నా కూడా పట్టించుకోకుండా, "అన్నయ్య.. వెళ్దామా?" అని ఉత్సాహంగా అడిగాడు.....
నీల్ తన తమ్ముడి అమాయకత్వానికి మనసులోనే నవ్వుకుని, ప్రేమగా తమ్ముడి భుజంపై చేయి వేసి, "పద వెళ్దాం.." అంటూ ఇద్దరూ కలిసి మెట్లు దిగి కిందకు వెళ్లారు..
అక్కడ కింద, పూజ గదిలో సీతగారు అన్నీ సిద్ధం చేస్తూ బిజీగా ఉన్నారు. అప్పుడే అక్కడికి వచ్చిన జానకి గారు "సీత.. పిల్లలేరమ్మా? ఇంకా రాలేదేంటి?" అని ఆరాటంగా అడిగారు.....
"వస్తున్నారు అత్తయ్య.. పెద్దోడు రెడీ అయ్యి, చిన్నోణ్ణి లేపడానికి వెళ్ళాడు. ఇప్పుడే వచ్చేస్తారు" అని సీతగారు నవ్వుతూ సమాధానం ఇచ్చారు.....
అంతలోనే, "గుడ్ మార్నింగ్ ఆల్!" అనే ఒక హుషారైన పిలుపు వినబడింది. ఇద్దరూ షేర్వాణీలలో మెరిసిపోతూ పూజ గదిలోకి అడుగుపెట్టారు. ఆ కళకళలాడే ముఖాలను చూడగానే జానకి గారి కళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది. వెంటనే వాళ్ళ దగ్గరకు వెళ్లి, "నా మనవళ్లు అచ్చం రాజకుమారుల్లా ఉన్నారు. ఎవరి దిష్టి తగలకూడదు నా బంగారు తండ్రులకి" అంటూ ప్రేమతో మెటికలు విరిచారు......
వెనక నుంచి వచ్చిన ప్రతాప్ గారు మీసం మెలేస్తూ, "మరి ఎవరి పోలిక అనుకున్నావ్ జానూ? మన పోలికే కదా!" అని గర్వంగా అనేసరికి అందరి ముఖాల్లో నవ్వులు పూశాయి....
అప్పుడే రామ్ గారు ఎంట్రీ ఇచ్చి, "హా.. మీ పోలికే నాన్న! ముందు పూజ సంగతి చూద్దాం పదండి, టైమ్ అవుతోంది.. మీ ముచ్చట్లు తర్వాత తీరికగా చెప్పుకోవచ్చు" అంటూ అందరినీ పూజలో కూర్చోబెట్టారు.....
పంతులుగారి మంత్రోచ్ఛారణల మధ్య 'శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం' అత్యంత భక్తిశ్రద్ధలతో మొదలైంది. కుటుంబ సభ్యులందరూ నిష్టగా పూజలో పాల్గొన్నారు. వ్రతం పూర్తయ్యాక, పంతులుగారు అందరికీ తీర్థ ప్రసాదాలు ఇచ్చి ఆశీర్వదించారు.....
"అమ్మ.. ఇక నేను వెళ్లొస్తాను" అని పంతులుగారు సెలవు తీసుకోబోతుండగా, జానకి గారు నీల్ మరియు విన్నులను పిలిచారు. వారి చేతుల మీదుగానే పంతులుగారికి దక్షిణ ఇప్పించి, పాద నమస్కారం చేసుకోమన్నారు....
నిజానికి నీల్‌కి ఇలాంటివి పెద్దగా ఇష్టం లేకపోయినా, తన మనసులోని భావాలను పక్కన పెట్టి, కేవలం తన నానమ్మ మనసు కష్టపడకూడదని ఆమె మాటను గౌరవించి, విన్నుతో కలిసి పంతులుగారి ఆశీర్వాదం తీసుకున్నాడు....
💞💖💞💖💞💖💞💖💞💖💞💖💞💖
మన మేఘ పాప ఉత్సాహం గురించి తెలిసిందేగా! షాపింగ్ మాల్‌కి వెళ్లిందంటే చాలు.. ప్రపంచాన్ని మర్చిపోయి హ్యాపీగా షాపులన్నీ తిరుగుతూ, నచ్చినవన్నీ కొనేస్తూ ఉంటుంది....
అలా తిరుగుతుంటే కళ్ళకు భలేగా కనిపించింది ఒక ఐస్‌క్రీమ్ పార్లర్...."అబ్బా! ఐస్‌క్రీమ్!" అని నోరూరిపోయి అటుగా వెళ్తుంటే.. పక్కన ఒక సీన్ జరిగింది.....
కొంతమంది అల్లరి మూక ఆడపిల్లల దగ్గర పిచ్చి పిచ్చిగా వాగుతున్నారు. మొదట మేఘ, "మనకెందుకులే గొడవ" అని సైలెంట్‌గా వెళ్ళిపోదాం అనుకుంది. కానీ, వాళ్ళలో ఒకడు అతి తెలివి ప్రదర్శించి, ఒక అమ్మాయి చేయి పట్టుకోవాలని చూశాడు.....
అంతే! మేఘకి ఒక్కసారిగా చిర్రెత్తుకొచ్చింది.బీపీ మీటర్ టక్కున పగిలిపోయింది.....
మెరుపులా వాడి దగ్గరికి వెళ్లి, వాడు అ అమ్మాయి చేయి పట్టుకునే లోపే... మేఘ వాడి చెయ్యి పట్టుకుని ఒక్క మెలి తిప్పింది. వాడు ఆ నొప్పి భరించలేక, "చోడ్ దో.. చోడ్ దో" (వదిలేయ్) అని హిందీలో ఏడుస్తూ అరుస్తున్నాడు.....
"ఏంట్రా వదిలేది?" మేఘ గట్టిగ అడిగింది. "ఆ అమ్మాయి కూడా మిమ్మల్ని వదిలేయమని అడిగితే వదిలారా? ఇప్పుడు నిన్ను నేనెందుకు వదలాలి?" అంటూ వాడి కడుపులో గట్టిగా ఒక గుద్దు గుద్దింది. వాడు అబ్బా అంటూ అక్కడే చతికిలపడ్డాడు.....
అది చూసి రెండోవాడు మీదికి వస్తుంటే.. మేఘ గాలిలోకి ఎగిరి వాడిని గట్టిగా ఒక తన్ను తన్నింది! వాడు వెళ్లి దూరాన పడ్డాడు. ఇక మూడోవాడు భయంతో వణికిపోతూనే, ఏమీ తోచక మేఘ మీద చేయి ఎత్తాడు. మేఘ వాడి చేతిని పట్టేసుకుని, చెంప పగలగొట్టడానికి చేయి ఎత్తింది!
వాడు బిక్కుబిక్కుమంటూ, "చోడ్ దో సిస్టర్!" అని బ్రతిమలాడాడు.....
మేఘకి ఇంకా కోపం తగ్గలేదు. "ఏంట్రా చోడ్ దో? ఇవాళ నీ ఎముకలు విరవకుండా వదలను రా బక్కోడా!" అని తిట్టడం మొదలుపెట్టింది.....
పాపం వాడికి హిందీ తప్ప తెలుగు రాదు. మేఘ ఏం మాట్లాడుతుందో అర్థం కాక, నొప్పితో "దీదీ.. ముఝే కుచ్ భీ సమజ్ నహీ ఆరహా హై" (అక్కా.. నాకు ఏమీ అర్థం కావడం లేదు) అని మొత్తుకుంటున్నాడు.....
కానీ మేఘ వింటేగా! "నీ బొంద రా నీ బొంద! దరిద్రుడా.. అరచేంబు మొహం వేసుకుని నక్క నాయాల! అచ్చం ఎండిపోయిన తొండ పిల్లలా ఉన్నావ్.. అడ్డగాడిద!" అని ఆపకుండా తిడుతూనే ఉంది, బాదుతూనే ఉంది. పాపం, వాడు ఆ తిట్లు, దెబ్బలు తట్టుకోలేక అక్కడే కళ్ళు తిరిగి పడిపోయాడు.....
అంతలో రఘు గారు వచ్చి, "చాల్లే కన్నా! వాడు ఎప్పుడో కళ్ళు తిరిగి పడిపోయాడు.. ఇంకా ఆపు తల్లి," అని నవ్వుతూ ఆపారు.....
మేఘ వెంటనే కూల్ అయిపోయి, తండ్రి చేతిలోని వాటర్ తాగి రిలాక్స్ అయింది. రఘు గారు ఆప్యాయంగా తన తల నిమురుతూ, "దెబ్బలు ఏమైనా తగిలాయా కన్నా?" అని అడిగారు.....
మేఘ ముద్దుగా ముఖం పెట్టి, "నాకేం కాలేదు డాడీ.. వాళ్లు తప్పు చేశారు, అందుకే కొట్టాను," అంది.....
రఘు గారు గర్వంగా కూతుర్ని దగ్గరకు తీసుకుని, "నేను అంతా చూశాను తల్లి.. నా కూతురు బంగారం!" అంటూ నుదుటి మీద ముద్దు పెట్టుకున్నారు.....
ఆ అమ్మాయి వచ్చి థాంక్స్ చెప్తే, మేఘ నవ్వుతూ... "చూడు మా.. ఎవరో వస్తారు మనల్ని కాపాడతారు అని చూడకూడదు. మనల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకొనేలా ఉండాలి. నాలా రెండు పీకితే సెట్ అయిపోతారు!" అని జాగ్రత్తలు చెప్పి పంపేసింది.....
తండ్రీకూతుళ్లు ఇద్దరూ నవ్వుకుంటూ వెనక్కి తిరగగానే.. అక్కడ మేఘ పవిత్ర గారు నిలబడి ఉన్నారు ! ఆవిడ ముఖం కోపంతో ఎర్రగా అయిపోయింది.....
"ఇందాకే కదా గొడవలు వద్దు అని చెప్పి పంపించాను? అప్పుడే యుద్ధం మొదలుపెట్టావా?" అని ఆవిడ నీరసంగా అడిగారు. "జనరల్‌గా ఎవరైనా అమ్మాయిల్ని బయటకి పంపాలంటే భయపడతారు. కానీ మన ఇంట్లో మాత్రం నిన్ను బయటకి పంపాలంటే... నువ్వు ఎవరిని కొడతావో అని భయంగా ఉంది!" అని తల బాదుకున్నారు....
మేఘ వెంటనే అమ్మ దగ్గరికి వెళ్లి గట్టిగా హగ్ చేసుకుని, తండ్రికి సైగ చేసింది. అంతే! ఇద్దరూ ఒకేసారి వచ్చి పవి బుగ్గ మీద ముద్దు పెట్టారు.
మేఘ: "సారీ పవి!"
రఘు గారు: "ప్లీజ్ పవి!"
పబ్లిక్ లో అందరి ముందు తన భర్త, కూతురు అలా ముద్దు పెట్టేసరికి పవి కంగారు పడిపోయింది. చుట్టూ ఉన్నవాళ్లంతా నవ్వుతుంటే, ఆవిడ సిగ్గుతో మొహం చేతుల్లో దాచుకుంది....
ఇంకా ఉంది.... 💞💞