ఆ గది అంతా మల్లెపూల సువాసనతో నిండిపోయి ఉంది. మంచం మీద తెల్లటి దుప్పటి, చుట్టూ రంగు రంగుల డెకరేషన్..
చూస్తుంటే ఎవరికైనా ఇది ఒక మధురమైన రాత్రి అనిపిస్తుంది.
కానీ, ఆ గదిలో ఉన్న అభి, నవ్యలకు మాత్రం అది ఒక పెద్ద పరీక్షలా ఉంది.నవ్య పట్టుచీరలో, భారమైన నగలతో మంచం మీద కూర్చుని ఉంది. ఆమె ముఖంలో పెళ్లి కళ కంటే ఎక్కువగా ‘ఇప్పుడు ఏం చేయాలి?’ అన్న కంగారు కనిపిస్తోంది.
సరిగ్గా అప్పుడే అభి గదిలోకి వచ్చాడు. పట్టు పంచె కట్టుకుని, చేతిలో పాల గ్లాసు పట్టుకుని అడుగు తీసి అడుగు వేస్తూ లోపలికి వచ్చి తలుపు గడియ పెట్టాడు.ఆ ‘టక్’ మన్న శబ్దం వినగానే నవ్య ఉలిక్కిపడి లేచింది.
నవ్య: “ఏయ్! తలుపు ఎందుకు వేస్తున్నావ్?” (కంగారుగా అడిగింది)
అభి: (నివ్వెరపోయి) “మరి మొదటి రాత్రి రోజు తలుపు తీసి పెడతారా ఏంటి? బయట మా పిన్ని, మీ అత్తయ్య కాపలా ఉన్నారు.. తలుపు వేయకపోతే లోపలికి వచ్చి మరీ ఆశీర్వదిస్తారు!”అభి వచ్చి మంచం పక్కన ఉన్న సోఫాలో కూర్చుని పాల గ్లాసు టీపాయ్ మీద పెట్టాడు.
అభి: “నవ్యా.. అసలు ఏంటి ఇది? మనం బెస్ట్ ఫ్రెండ్స్ కదా! పొద్దున్న దాకా కలిసి క్రికెట్ ఆడాం, సాయంత్రం అయ్యేసరికి ఇలా మొగుడు పెళ్ళాల్లా ఈ గదిలో కూర్చుంటాం అని కలలో కూడా అనుకోలేదు.”
నవ్య: (నిట్టూర్పు విడుస్తూ) “అంతా నీ వల్లే అభి! ఆ రోజు మీ అమ్మకి ఆ అబద్ధం చెప్పకపోయి ఉంటే, ఈరోజు మనకి ఈ గతి పట్టేది కాదు. ఇప్పుడు చూడు.. మెడలో తాళి, చేతికి మెహందీ.. అస్సలు నమ్మలేకపోతున్నాను.”
అభి: “సరే జరిగిందేదో జరిగింది. ఇప్పుడు ఈ రాత్రి ఏం చేద్దాం? నీ పక్కన పడుకోవాలంటే నాకు భయంగా ఉంది. ఎక్కడ నిద్రలో నన్ను తంతావో అని!”
నవ్య: (కోపంగా) “నేను తన్నను కానీ.. నువ్వు మాత్రం ఆ సోఫాలోనే పడుకో. ఈ మంచం నాది! మనం ముందే అనుకున్నాం కదా, ఇంట్లో వాళ్ళ కోసం పెళ్లి చేసుకున్నా.. లోపల మాత్రం మనం ఫ్రెండ్స్ లాగే ఉంటామని.”
అభి: “అమ్మో! మహారాణి గారు ఆర్డర్ వేశారు. సరే.. కానీ రేపు పొద్దున్న మా అమ్మ వచ్చి అడిగితే ఏం చెప్పాలి?”
నవ్య: “ఏదో ఒకటి మేనేజ్ చేద్దాంలే. ముందు ఈ నగలు తీసెయ్యాలి.. అబ్బా! చాలా బరువుగా ఉన్నాయి.
కొంచెం ఈ వెనకాల పిన్నులు తీయవా?” అని వెనక్కి తిరిగింది.
అభి మెల్లగా ఆమె దగ్గరికి వెళ్ళాడు. అంతవరకు అల్లరి చేస్తున్న గదిలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది.
నవ్య మెడలోని మల్లెపూల వాసన అభిని ఏదో తెలియని లోకంలోకి తీసుకెళ్లింది. ఆమె జడలో ఉన్న పిన్నులు తీస్తుంటే, అభి చేతులు కొంచెం వణకడం నవ్య గమనించింది.అద్దంలో అభి ముఖాన్ని చూసిన నవ్యకు.. ఎప్పుడూ లేని విధంగా అతని కళ్ళలో ఏదో కొత్త మెరుపు కనిపించింది.
నవ్య: (మెల్లగా) “అభి.. ఏమైంది?”అభి వెంటనే తేరుకుని వెనక్కి జరిగాడు.అభి: “ఏం.. ఏం లేదు! పిన్నులు తీసేశాను. వెళ్ళు.. వెళ్లి బట్టలు మార్చుకో. నేను ఈ సోఫాలోనే అడ్జస్ట్ అవుతాను.”నవ్య వాష్‌రూమ్‌లోకి వెళ్ళాక, అభి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది.
“ఇది కేవలం స్నేహమేనా? లేక నాలో ఏదైనా మార్పు మొదలవుతుందా?” అని తనని తాను ప్రశ్నించుకున్నాడు.
నవ్య స్పర్శ అభి గుండెల్లో ఒక చిన్నపాటి భూకంపాన్నే సృష్టించింది. ఒకప్పుడు క్రికెట్ స్కోర్లు, సినిమాల గురించి గంటల తరబడి వాదించుకునే ఆ చేతులే, ఇప్పుడు ఒకరినొకరు తాకడానికి తటపటాయిస్తున్నాయి.
అభి: "నవ్య, ఒక విషయం చెప్పు.. ఇందాక అద్దంలో నన్ను చూసి ఎందుకు అలా నవ్వుకున్నావు?"నవ్య: "నువ్వు ఆ పిన్నులు తీస్తున్నప్పుడు నీ మొహం చూశాను. ఏదో బాంబు డిఫ్యూజ్ చేస్తున్నట్టు అంత టెన్షన్ పడుతున్నావు.. అది చూసి నవ్వొచ్చింది.
బాగా నా మీద జోకులు వేస్తున్నావే నువ్వు నీకు భయం లేకుండా పోయింది నేను అంటే అని అన్నాడు అభి.
నీకు నేను ఎందుకు భయపడతాను రా అని అంటుంది నవ్య.
అంటే పెళ్లి అవ్వగానే చాలా మంది లేడీస్ హస్బెండ్ నీ చాలా గౌరవిస్తారు గా అండ్ ఏదో కొంచెం భయపడతారేమో అనుకున్న లే నేను అని అంటాడు అభి.
నీ మొహానికి అంత సీన్ లేదులే రా....
అయినా నిన్ను చూసి నేను భయపడతానా చెప్పు అని ఆటిట్యూడ్ తో అంది నవ్య...
నీ దగ్గర నుంచి ఇలాంటివి ఎక్స్పెక్ట్ చెయ్యడం నాది తప్పు అని తల కొట్టుకున్నాడు అభి....
హా..... ఇప్పుడు బాగా అర్థం అయ్యింది ఐతే నీకు అని నవ్వుతుంది నవ్య....
"అభి చిన్నగా నవ్వి, ఇది పెద్ద దెయ్యం అనుకున్నాడు. ఇద్దరి మధ్య ఇంకా ఆ స్నేహమే ఉంది, కానీ ఆ స్నేహంలో ఇప్పుడు ఒక కొత్త 'హక్కు' కనిపిస్తోంది.
ఒకరికొకరు ప్రాణ స్నేహితులు.. కానీ ఇప్పుడు ఒకే గదిలో భార్యాభర్తలుగా! వారి ప్రయాణం ఇప్పుడే మొదలైంది.
నేను కొత్తగా స్టోరీస్ రాస్తున్న ప్లీజ్ సపోర్ట్ చెయ్యండి ఫ్రెండ్స్.
అలాగే చదివి రేటింగ్ ఇచ్చి కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
కొనసాగుతుంది....