What is my fault? - 1 in Telugu Thriller by Lakshmi Prasanna books and stories PDF | నా తప్పు ఏంటి? - 1

Featured Books
Categories
Share

నా తప్పు ఏంటి? - 1

హాయ్ అండీ!!! నేను నా మొదటికథని రాస్తున్నా దయచేసి కాస్త వోపికగా చదివి మీ అభిప్రాయం తెలుపండి!!!

1

డిసెంబర్, 2025.

“చలికాలమా లేక పొరపాటున నిద్రలో అంటార్కిటికా వచ్చేశానా…” అనే అనుమానం వచ్చేలా వణికిస్తోంది బెంగళూరు చలి… చలికి వణుకుతూ దుప్పట్లలో దూరి మరీ కునుకు తీస్తున్నారు బెంగళూరు వాసులు… ఆకుల పైన చినుకులుగా మారిన మంచు బిందువుల బరువు మోయలేక, గాలి వీస్తే భారం దించేసుకుందాం అని ఎదురు చూస్తున్నాయి చెట్ల కొమ్మలు… తెల్లటి మంచు తెర… చల్లని వాతావరణం… నిద్రమత్తుని ఇంకా బలపరుస్తూ… గాఢమైన నిద్రమత్తులోకి నెట్టేస్తున్నాయి…

అప్పుడే మ్రోగింది “ట్రింగ్… ట్రింగ్… ట్రింగ్…” అంటూ అలారం… “ప్చ్…” అనే చిన్న విసుగుతో దుప్పట్లో నుంచి ఒక చెయ్యి… కన్నంలో ఎలకలా బయటికి వచ్చి ఆ అలారాన్ని ఆపేసింది…

“అబ్బా… ఇప్పుడు లేచి ఆఫీస్‌కి వెళ్లాలా?” అని మనసులో అనుకుంటూ నిద్రలోనే ఆలోచిస్తుంది శృతి…

“అసలు ఈరోజు శనివారం అయితే ఎంత బాగున్నో… కానీ శనివారానికి ఇంకా ఇరవై నాలుగు గంటలు ఉన్నాయే…” అనుకుంటూ ఇంకా మత్తుగా నిద్రలోకి జారుకుంటుంది…

5 నిమిషాల తర్వాత…

“శృతీ… ఇప్పుడు లేవకపోతే క్యాబ్ వెళ్లిపోతుంది, లేట్ అవుతుంది… తర్వాత ట్రాఫిక్‌లో ఇరుక్కుంటే ఇంకా ఆఫీస్‌కి వెళ్లినట్టే… ఈరోజు ఒక్క రోజు వెళ్తే చాలు, రేపే వీకెండ్… లే డార్లింగ్…” అని తనకు తానే నచ్చజెప్పుకుని కష్టపడి లేచింది…

కాస్త ఒళ్లు విరుచుకుందాం అంటే బాల్కనీ నుంచి సన్నటి మంచు పొగ దొంగలా లోపలికి వస్తూ వణికిస్తుంది… వెంటనే లేచి ఆ కర్టెన్ మూసేసింది…

లేచేవరకే ఆగడాలు, ఒక్కసారి లేచాక ఇంక అన్నీ ఉరుకులూ… పరుగులేగా… వెంటనే వెళ్లి ఫ్రెష్ అయి వణుకుతూ బయటికి వచ్చింది…

“లాస్యా… టైమ్ 7 అయింది… లేవ్వే ఇంకా… క్యాబ్ వెళ్లిపోతుంది మళ్లీ…” అని తన రూమ్‌మేట్‌ని నిద్రలేపింది…

ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ ఏం చేశాడో ఏంటో… అని మాట్లాడుకుంటున్నారు లిఫ్ట్‌లో కిందకి వస్తూ… లాస్య & శృతి…

“ఈరోజు ఉప్మా లే అక్కా… నీకు ఎలానూ నచ్చదు గా… ఈరోజుకి ఆఫీస్ క్యాంటీన్‌లో తినేయ్…” టిఫిన్ బాక్స్ పట్టుకుని కిచెన్ వైపు వెళ్తున్న శృతితో అన్నాడు కిట్టు… (PG ఓనర్ కొడుకు)

“అబ్బా… అవునా… సరే రా… అక్కడే తింటాలే… బై…” కిట్టుకి బై చెప్పి వెళ్లిపోయారు ఇద్దరూ…

“అసలు ఈ ఉప్మాని ఎవరు కనిపెట్టారో కానీ… వాళ్లు కానీ నాకు దొరికితేనా…” అనుకుంటుంది శృతి విసుగ్గా క్యాబ్ వైపు వెళ్తూ…

ఆ తెల్లటి మంచు పొర కప్పేస్తున్న లావెండర్ రంగు పూల చెట్లు దగ్గరికి వెళ్తున్న కొద్దీ… అందంగా కనిపిస్తున్నాయి క్యాబ్‌లో వెళ్తున్న శృతికి…

“ఏంటోనే… అందరూ మార్నింగ్ వాక్స్ చేసే టైమ్‌లో మనం సీరియస్‌గా ఆఫీస్‌కి బయలుదేరాం చూడు…” రోడ్ మీద వాకింగ్ చేస్తున్న వాళ్లని చూపిస్తూ చెప్తుంది లాస్య…

“యా… ఇట్స్ టూ బోరింగ్… ఐ యామ్ టూ స్లీపీ…” అంటుంది ముందున్న మరో అమ్మాయి…

“మన బాస్ ఆ LKGలో చదివిన ‘Early to bed and early to rise’ పోయెమ్‌ని చాలా సీరియస్‌గా తీసుకున్నాడు లేవే… అందుకే ఇంత ఎర్లీగా ఆఫీస్ పెట్టేశాడు…” అంది శృతి…

అందరూ పగలబడి నవ్వుకున్నారు…

ఇంతలో ఆఫీస్ వచ్చేసింది… అందరూ బ్రేక్‌ఫాస్ట్ చేసి… పనులు మొదలుపెడుతున్నారు మెల్లగా…

“గుడ్ మార్నింగ్ శృతి…” అప్పుడే వచ్చిన శృతికి చెప్తున్నాడు పక్కనే ఉన్న అభి…

“GM అభి… ఈరోజు మన టాస్క్స్ ఏంటో నిన్న మెయిల్ చేశాను… అవన్నీ అప్‌డేట్ చేసి బాస్‌కి మెయిల్ చేయాలి…”

“సరే మేడమ్… అదే చూస్తున్నా…”

ఇద్దరూ పని మొదలు పెట్టారు…

***

“హే… నిన్న మా ఇంట్లో ఆనంద్ గురించి చెప్పేశానే… మా డాడీ ఆల్మోస్ట్ ఒప్పుకున్నారు… వీకెండ్ తనని ఇంటికి తీసుకురమ్మన్నారు…” చెప్తుంది మార్నింగ్ బ్రేక్‌లో కాఫీ తాగుతూ కూర్చున్న ఫ్రెండ్స్‌తో కావ్య…

ఆ మాట వినగానే ఒక్కసారిగా మైండ్ కాస్త బ్లాంక్ అయింది శృతికి…

“వావ్!!! గ్రేట్ న్యూస్… పెళ్లి ఫిక్స్ అన్నమాట అయితే… పార్టీ ఎప్పుడు ఇస్తున్నావ్…” అడిగాడు ఒక ఫ్రెండ్…

“ముందు పెళ్లి ఫిక్స్ అవ్వనీ… తర్వాత పార్టీ ఇస్తా…”

“పెళ్లయ్యాక వాడు పార్టీలను మార్చకుండా ఉంటే అంతే చాలు…” అనుకుంది తనలో తానే శృతి…

“కావ్య… ఆర్ యూ ష్యూర్ అబౌట్ దిస్?” తనకి మాత్రమే వినిపించేలా అడిగింది పక్కనే కూర్చున్న కావ్యని…

“యా!!! వై నాట్? మేమిద్దరం 6 ఇయర్స్ నుంచి రిలేషన్‌షిప్‌లో ఉన్నాం… ఈ మూమెంట్ కోసం చాలా వెయిట్ చేశాం… ఐయామ్ రియల్లీ ష్యూర్ అబౌట్ దిస్…” చాలా నమ్మకంగా చెప్పింది…

“నిజంగా ఒక మనిషి గురించి 6 ఇయర్స్‌లో అన్నీ తెలిసిపోతాయా?...” ఆలోచనలో పడింది…

“ఓకే, ఆల్ ది బెస్ట్…” అని నామమాత్రంగా చెప్పి ఊరుకుంది…

“అరే ఇంతకీ ఈ వీకెండ్ లంచ్‌కి అందరూ వస్తున్నారు కదా…” అడిగాడు ఓ ఫ్రెండ్…

“ఎందుకు రామురా… ప్లాన్ చేసింది ఆర్ట్ కేఫ్‌కి కదా… నాకు చిన్నప్పుడు స్క్వేర్ గీయడమే వచ్చేది కాదు… కానీ ఆర్ట్ కేఫ్ అనగానే ఎక్సైట్మెంట్ వచ్చేస్తుంది…” అన్నాడు మరో ఫ్రెండ్…

అందరూ నవ్వుకున్నారు…

“ఆర్ట్ కేఫ్ అంటే ఏం లేదు రా… ఒక క్యాన్వాస్ ఇచ్చి నీకు నచ్చింది గీయమంటారు అంతే… అయినా ఎందుకు టెన్షన్? శృతి ఉందిగా… తను చాలా మంచి ఆర్టిస్ట్…” చెప్పింది లాస్య…

“అవునా… నిజమా శృతి? ఎప్పుడూ చెప్పలేదు… కనీసం చూపించలేదు మాకు…” అన్నాడు ఓ ఫ్రెండ్…

“గీస్తా… కానీ గీసేది అందరికీ చూపించుకోవడానికి కాదు… అండ్ నేను ఏమీ డా విన్సీ అంత ఆర్టిస్ట్‌ని కాదు… ఏదో హాబీ అంతే…” చాలా జోవియల్‌గా చెప్పేసింది…

“సరేలే… వీకెండ్ చూద్దాంగా… నాకు మాత్రం నువ్వు హెల్ప్ చేయాలి… ముందే చెప్పేస్తున్నా…” అన్నాడు వెటకారంగా మరొకడు…

“సారీ అబ్బా… నేను రావట్లేదు… నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆర్ట్ కేఫేస్…” క్యాజువల్‌గా చెప్పేసింది…

“ఓకే గైస్… నాకు ఒక కాల్ ఉంది, నేను వెళ్తున్నా… బై…” లేచి వెళ్తూ చెప్పింది శృతి…

“ఏంటి రా తను ఇంత బోరింగ్ పర్సన్… సరదాగా వస్తే ఏమైందంట…” ఎవరికీ వినిపించకుండా పక్క వాడితో అన్నాడు ఒకడు…

“మచ్చా… తను ఏం బోరింగ్ కాదు… షీ ఈజ్ ప్రాక్టికల్… అంతే…” అన్నాడు అభి…

“సరేలే… మీకు ఏం పనులు లేవా? వెళ్దాం పదండి…” అందరినీ బలవంతంగా లేపింది లాస్య…

***

“అలిసిన ఒళ్లు బయటికి కనిపిస్తుంది కానీ… అలిసిన మెదడు ఎవరికీ కనిపించదు… బహుశా ఆ అలసట దాచేయడమేనేమో ఈ కార్పొరేట్ అంటే…” అనుకుంటుంది రోడ్ పైన వెళ్తున్న కన్‌స్ట్రక్షన్ వర్కర్స్‌ని చూస్తూ తిరిగి వెళ్లేటప్పుడు …

“ఒళ్లు అలిసినా… వాళ్ల పెదాల పైన చిరునవ్వు ఏం తగ్గలేదు… ఇక్కడ మనుషులు టీవీగా కనిపిస్తున్నారు కానీ మోహం మీద ఏ ఆశ లేదు…” ఆలోచిస్తుంది తన క్యాబ్‌లో ఉన్న వాళ్లని, రోడ్ పైన వర్కర్స్‌ని చూస్తూ…

“నువ్వు చేసే పనిలో అలసట మాయం అవ్వాలి అంటే ఆ పనిని ఆ చోటనే వదిలి రావాలి… పనిని బుర్రలో మోస్తూ ఉంటే విశ్రాంతి ఎప్పుడూ దొరకదు…” అమ్మ మాటలు గుర్తొచ్చాయి…

చిన్నగా నవ్వుకుంది…

“ఆ అమ్మా… ఇప్పుడే వచ్చాను ఆఫీస్ నుంచి… ఈరోజు ఏమైందో తెలుసా…” ఆఫీస్ నుంచి వచ్చి అమ్మతో చిన్న పిల్లలా కబుర్లు చెప్పడం మొదలు పెట్టింది…

కళ్లు, చేతులూ కదుపుతూ తను చెప్పే మాటలన్నీ కన్నార్పకుండా చూస్తుంది వాళ్ల అమ్మ…

“ఏంటి అమ్మా అలా చూస్తున్నావు…” కళ్లు ఎగరేసి అడిగింది…

“ఏం లేదు… లోడలోడా వాగి వాగి ఆ గొంతు ఏమైనా అరిగిపోయిందేమో అని చూస్తున్నా…” వెటకారంగా అంది…

“హ్మ్మ్…” ఓరకంటగా చూసి మూతి తిప్పింది శృతి…

“సరేలే… వాగి వాగి అలిసిపోయావు కానీ… వెళ్లి ఏమైనా తినేసి పడుకో…” నవ్వుతూ చెప్పి ఫోన్ పెట్టేసింది…

***

“గుడ్ మార్నింగ్, శృతి… ఏంటి ఈరోజు ఇంకా అందంగా కనిపిస్తున్నావ్…” ఓ మండే మార్నింగ్ పనిలో లీనమై ఉన్నప్పుడు వెనక నుంచి వినిపించింది ఒక గొంతు…

“కళ్లద్దాలు సరిగ్గా తుడవలేదేమో… చూసుకోండి…” వెటకారంగా అనేసింది…

“టాస్క్ ఎంత వరకు ఫినిష్ అయింది…” సిగ్గుతో తలదించుకుని అడిగాడు…

“అది నిన్న వెళ్లేముందే మీకు మెయిల్ చేశాను మిస్టర్ విజయ్… జస్ట్ చెక్ ఇట్…”

“ఓహ్! సారీ… నేను చూసుకోలేదు…” కవర్ చేస్తున్నట్టుగా అన్నాడు…

“ఇట్స్ ఓకే…” చూడకుండానే చెప్పింది…

“శృతి… కాఫీకి వెళ్దామా?” అడిగాడు మొహమాటంగా…

“మీకు తెలుసుగా విజయ్… నేను కాఫీ తాగను అని…” ల్యాప్‌టాప్‌లో ఏదో నొక్కుతూ చెప్పింది…

“సరే… అట్‌లీస్ట్ కంపెనీ ఇవ్వొచ్చు గా నాకు…”

‘అబ్బా… వీడు ఇంకా వదలడు… ఏం చెప్పాలి…’ ఆలోచిస్తుంది…

“సారీ… నాకు ఇంకో 5 మినిట్స్‌లో కాల్ ఉంది… కాబట్టి ఈసారి మీరు వెళ్లి వచ్చేయండి…” నవ్వుతూ చెప్పేసింది…

“అస్స లు దొరకవే…” తనలో తానే చిన్నగా అనుకుని వెళ్లిపోయాడు…

‘హమ్మయ్యా!…’ అనుకుని మళ్లీ పనిలో మునిగిపోయింది…

***

“హే శృతి… రేపు న్యూ ఇయర్ కదే… ఈ ఇయర్ అయినా మాతో పార్టీకి రావే… చాలా బాగుంటుంది…” లంచ్ బ్రేక్‌లో అడిగింది లాస్య…

“నీకు తెలుసుగా లాస్య… నాకు ఇవన్నీ నచ్చవు… మీరు వెళ్లి ఎంజాయ్ చేయండి…” తింటూ చెప్పింది…

“ప్లీజ్ శృతి… చాలా బాగా ప్లాన్ చేశాం… బెంగళూరు అంతా అక్కడే ఉంటుంది… నువ్వు ఒక్కదానివి రూమ్‌లో ఏం చేస్తావ్ చెప్పు…” అన్నాడు అభి…

చిన్నగా నవ్వుకుంది…

“నువ్వేం తాగొద్దులే… జస్ట్ రా అంతే…”

“నువ్వు తాగమన్నా నేను తాగను లే కానీ… అక్కడ అంతా ఫుల్ స్మోకింగ్, డ్రింకింగ్ చేస్తారు… నాకు ఆ వాసన అది నచ్చదు… కాబట్టి నేను రాను…”

“అయినా న్యూ ఇయర్ రోజు ఆ నెగెటివ్ ఎనర్జీ అంతా అవసరమా… నేను ప్రశాంతంగా నిద్రపోతా… అదే నాకు సెలబ్రేషన్…” వెటకారంగా చెప్పింది…

“నువ్వు మారవు… ప్రపంచం అంతా మేలుకొని ఉంటే నువ్వు మాత్రం నిద్రపో…”

అంతా డెప్పుతున్నట్టుగా అని వెళ్లిపోయారు…

ముసిముసిగా నవ్వుకుంది శృతి…

***

“బంగారం… బయలుదేరావా…?” అడుగుతుంది ఫోన్‌లో వాళ్ల అమ్మ ఓ ఫ్రైడే ఈవెనింగ్…

“బస్‌కి ఇంకా గంట ఉంది మా!… ఇంకా ఆఫీస్‌లోనే ఉన్నా… కొంచెం వర్క్ ఫినిష్ చేసి, బయలుదేరుతా…” చెప్పింది కంగారుగా పని చేస్తూ…

“సరే… కాస్త ముందే బయలుదేరు… మళ్లీ ఆ ట్రాఫిక్‌లో చిక్కుకోకు…”

“సరే మా… నేను బయలుదేరాక నీకు ఫోన్ చేస్తా… బై…” ఫోన్ పెట్టేసి పనిలో దూరిపోయింది…

“బై శృతి… హ్యావ్ ఫన్…” బస్‌స్టాప్‌కి బయలుదేరిన శృతికి సెండ్‌ఆఫ్ ఇస్తుంది లాస్య…

“బై లాస్య… జాగ్రత్త…” ఆటోలో నుంచి చెయ్యి ఊపుతుంది…

***

“హా నాన్న… ఇప్పుడే బస్ ఎక్కా… మార్నింగ్ ఒక 10.30 కల్లా వచ్చేస్తా…” స్లీపర్ బస్‌లో పక్క సర్దుకుంటూ చెప్తుంది ఫోన్‌లో…

“సరే తల్లి… జాగ్రత్తగా వచ్చేయ్… డిన్నర్ చేయడం మర్చిపోకు నిద్రలో పడి… ఆపగానే వెళ్లి తినేసి మళ్లీ పడుకో…” చెప్పారు వాళ్ల నాన్న…

“సరేలే… బై…” ఫోన్ పెట్టేసింది…

“అందరికీ నన్ను నా నిద్రని వేరు చేద్దామనే యాతన…” అనుకుంటూ హైవే పైన వెళ్తున్న బస్సుల్ని, కార్లని చూస్తూ అలా మెల్లగా నిద్రలోకి జారుకుంది…

*****

ఆరంభంలోనే ఆనకట్ట వేసేయకండి!!! అసలు కథ బోలెడు ఉంది...