యువకవి మురళీ కృష్ణ. మోర్లే ఆసిఫాబాద్ జిల్లా

నా ప్రియుడు కోసం.....
**********************

తను రవి అయితే నేను కలువనవుతాను
తను నెలరాజు అయితే నేను వెన్నెలవుతాను
తను అల అయితే నేను సంద్రమవుతాను
తను తుమ్మెదైతే నేను మధువునవుతాను
తను మేఘమైతే నేను చినుకునవుతాను
తను రాగమైతే నేను తాళమవుతాను
తను కోయిలైతే నేను పాటనవుతాను
తను పవలిస్తే పర్పునవుతా
తను పలకరిస్తే పిలుపునవుతా
తను తడిమితే స్పర్శనవుతా
తను కోరితే కలల స్వర్గమవుతా
తను ఆరాధిస్తే అందమైన పువ్వునవుతా
తను ఆస్వాదిస్తే సుగంధ పరిమళమవుతా
నా ప్రియుడి కోసం వేచివున్న ఎదురుచూపు నేను
నా సఖుడి లయశృతితో మృోగిన గుండెను నేను
మన్మధుడిని వలచని ఈ మానవ దేహం వ్యర్థమే
మనువు కాకుంటే తనతో ఈ జన్మ నాకింకా వృథే

- మురళీ గీతం...!!!

Read More

రాసి రాసి సిరా చుక్కలు
రాయనంటూ రంగును కోల్పోతే
కలం నీరసించింది
వాడి వాడి అక్షరాలు
వాడిపోయాయి పదాలు
నిలువలేక గుణింతాలకు
విని విని నీరసమొచ్చింది
కవిత్వంలో రాగం లేదని
దీర్ఘం రానంది
ఒత్తులు మా పేరైతే
అక్షరాలకు తొత్తులమా
అసలుసిసలు కవనానికి
ఆయువుపట్టే పునాదులం
పిచ్చి రాతలన్ని కలిసి
కాగితాలను పాడుచేస్తే
కవిత్వం పుట్టుకొస్తుందా
పాఠకుని భావాలు చంపే
కుతంత్రమై కుస్తుందా...
గమనించాలి కథలు
చదవాలి జీవితగాథలు
పుస్తకాలే కాదు మస్తకాలు పఠించాలి
కొత్త కొత్త అనుభవాలు
పొందగలిగితేనే కల్గు భావాలు
జ్ఞాపకాల రుచులతోనే
తియ్యగుండును కవిత్వాలు

©మురళీ గీతం...!!!
#Belong

Read More