క్షంతవ్యులు - 11

  • 8.5k
  • 2.2k

క్షంతవ్యులు – Part 11 చాప్టర్ 27 మరునాడు ఉదయాన్నే కాశీ చేరుకున్నాము. ఇల్లు దొరికేవరకూ ఏదైనా హోటల్లో వుందామన్నాను కాని యశో ఒక ఆంధ్ర ఆశ్రమం వైపు మొగ్గు చూపింది. త్వరలోనే గంగ ఒడ్డున ఒక మూడు గదుల ఇల్లు . కొనుక్కుని అందులోకి మకాంమార్చాము. ‘‘మనకి రెండు గదులు చాలు. ఒకటి వంటకి, మరొకటి పడకకి, మూడోది ఏం చేద్దాం చెప్పండి?’’ అంది యశో పాలు పొంగిస్తూ. ఆప్రశ్న కి సమాధానము తన కెంత తెలుసో నాకూ అంతే తెలుసు. ప్రతిరోజు సూర్యోదయవేళ మేమిద్దరం కలిసి గంగాస్నానం చేసే వాళ్ళం. వారానికొసారి సాయంకాలం బోటు మీద గంగపై విహరించేవాళ్లం. అన్నిటి కన్నా నాకు అదే నచ్చింది. అప్పుడప్పుడు ఒక రాత్రికి బోటు అద్దెకు తీసుకుని రాత్రంతా అందులోనే గడిపేవాళ్లం. అన్నివేళలా మాయిద్దరి జీవన బాట ఒకటైనా, కాశీ విస్వేస్వరుడి కొలువులో మాత్రం మాది వేరే దారి. యశో ఆ దైవం ఎదుట అరమోడ్పు కన్నులతో తన్మయిస్తే నేను తనను పరవసిస్తూ చూసే వాడిని. ‘‘దేముడి