మానవ అక్రమ రవాణా మరియు రుణం తీర్చుకోవడం.. - 2

  • 5.1k
  • 1.6k

Chapter----2 ఆ మాఫియాలకు మా నాన్న సమాధానం చెబుతాడా ???అనిఎదురుచూస్తూ ఉంటే నా హృదయం మెలికలు తిరిగిపోయింది....అమ్మలేను అని ఎందుకు చెప్పలేకపోతున్నాడు...???నేను భయంతో నిలబడి చూస్తున్నాను...నా గుండె వేగంగా కొట్టుకుంటుంది... నా కళ్ళు కన్నీళ్ళతో నిండిపోయాయి ...మద్యానికి బానిస అయిన నా తండ్రి చేసిన తప్పుకి నేనెందుకు శిక్ష అనుభవించాలి.....మా నాన్న ముఖం భావరహితంగా ఉంది....అతని కళ్ళలో ఆప్యాయతలను వెతకాలి అని నేను తీవ్రంగా ప్రయత్నించాను...కానీ అది మరుగున సూదిని వెతికినట్లు ఉంది... అతను గోళ్ళు కొరుకుతూ ఏదో ఆలోచిస్తూ తన ప్రాణాన్ని కాపాడుకోవాలా? లేక కూతురి జీవితాన్ని నాశనం చేయాలా? అని ఆలోచిస్తున్నాడు...అతని ఒక్క నిర్ణయం నా జీవితాన్నే మార్చేస్తుంది... క్షణం నిశ్శబ్ధం తర్వాత మరియు ప్రతిపాదనను జాగ్రత్తగా పరిశీలించి అతను మాట్లాడినాడు ....సరే ఆమెను తీసుకుని వెళ్లి ఆమె ను ఏమైనా చేసుకోండి.... కానీ నన్ను ప్రాణాలతో విడిచిపెట్టండి... అని అన్నాడు మా నాన్న.... అతని కళ్ళలో కాస్తంత