నిజం - 5

  • 3.1k
  • 1.4k

చిట్టి తండ్రి బసవ విజయ్ ని కుర్చీలో కూర్చోమని చెప్పి లోపలికి వెళ్ళి భార్య పిల్లలను తీసుకువచ్చాడు , తను నా భార్య అరుణ , ఇది నాకూతురు చిట్టి అని వాళ్ళను పరిచయం చేశాడు విజయ్ కి, విజయ్ నవ్వుతూ చిట్టి ని దగ్గరకు పిలిచి రా చిట్టి ఇలా కూర్చో , నేను మీ నాన్న ఫ్రెండ్ ని అన్నాడు ,అలా చెప్తే పాప భయపడకుండా తనతో ఫ్రీ గా మాట్లాడుతుందని , మీరు మా నాన్న ఫ్రెండ్ కాదు మా వూరికి కొత్తగా వచ్చిన పోలీస్ అని నాకు తెలుసు , అబద్దం చెప్పటం తప్పు కదా , పోలీస్ అయి ఉండి మీరే అబద్దం చెప్తే ఎలా అంది గడుచుగా చిట్టి వెంటనే అరుణ చిట్టీ పెద్దవాళ్ళ తో అలానేనా మాట్లాడటం తప్పు కదా అంది మందలిస్తూ , పర్వాలేదు అండి తనిలా ఫ్రీ గా