నిజం - 19

  • 2.3k
  • 780

Next day : విజయ్ శరభయ్య ని తీసుకొని వాన్ లో కోర్టు కి వెళ్ళాడు, ఈ విషయం వూరి జనానికి తెలీకుండా ఉదయాన్నే బయలుదేరి వెళ్లి పోయారు , మరో వైపు సాగర్ ,రాఘవులు , చంద్రం మరిడయ్య గురించి ఎంక్వైరీ చేయడానికి వెళ్లారు . కోర్టు లో శరభయ్య కి శిక్ష పడింది , ఏడుస్తున్న శరభయ్య ని చూసి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్ధం కాలేదు విజయ్ కి , హత్య కు వాడే వెపన్ లాగా వాడుకున్నారు శరభయ్య ని , ఈ వెపన్ ని వాడిన చేతులు కి మాత్రం ఇంకా బేడీ లు వేయలేదు , అందరి దృష్టి లో ఈ కేస్ పూర్తయింది , కానీ దీని వెనుక వున్న వాళ్ళను పట్టుకున్న రోజే నా దృష్టి లో కేస్ క్లోజ్ అయినట్టు అని తనలో తానే అనుకున్నాడు విజయ్