ఆ అజ్ఞాత సందేశం అనన్య గుండెల్లో వణుకు పుట్టించింది. కానీ ఆమెలోని అత్యాశ ఆ భయాన్ని క్షణాల్లోనే అణిచివేసింది."అనన్యా! ప్లీజ్.. ఆ మెసేజ్ చూశావు కదా? ఇదేదో చాలా పెద్ద ప్రమాదంలా అనిపిస్తోంది. వీడియో డిలీట్ చేసేయ్, ప్లీజ్!" అని అన్న విక్కీ గొంతులో వణుకు స్పష్టంగా వినిపిస్తోంది.అనన్య, విక్కీ మాటలను పట్టించుకోకపోవడమే కాకుండా, అతన్ని చూస్తూ హేళనగా నవ్వింది. "ఏంట్రా విక్కీ.. నువ్వు మరీ అంత అమాయకంగా ఉన్నావు, ఇదేవరో మనమంటే గిట్టనివాళ్ళు, కావాలని చేస్తున్నట్టు నీకు అనిపించడం లేదా..?" అని అంది."సక్సెస్ వచ్చే ముందు ఇలాంటి బెదిరింపులు కామన్ విక్కీ. ఎవరో మనల్ని భయపెట్టి ఆ వీడియోను వాళ్లు కాపీ చేయాలని చూస్తున్నారు. అంతే! ఈ మిస్టరీ గర్ల్ మన జీవితాల్ని మార్చబోతోంది. Just chill రా.. " అంటూ అనన్య, ఏమాత్రం ఆలోచించకుండా 'PUBLISH' బటన్ మీద తన వేలిని నొక్కింది.ఆ ఒక్క సింపుల్ క్లిక్.. వేద