Dr seetha

తను సీత…కానీ నేను రాముడిని కాదు.సీత కథ అనగానే,అందరూ ఇటువైపు రాముడు ఉంటాడని అనుకోవడం ఎందుకు?ఇక్కడ కథలోకి వస్తాడు **క్రిష్ – Krishna**.మీరు ఒక్క కంక్లూజన్‌కి వచ్చారు కదా…మరి ఇప్పుడు మనం కథలోకి వెళ్దామా?---**సీత** 1984 జూన్ 16న నంద్యాలలో జన్మించింది.మూడో తరగతి వరకు అక్కడే చదువుకుంది.అక్కడి నుంచి కోయలకుంట్లకు వెళ్లి, ఏడో తరగతి వరకు విద్యానికేతన్‌లో చదివింది.తర్వాత కర్నూలులో ఇంటర్ వరకు వాళ్ల అమ్మగారి ఇంట్లో ఉంటూ చదువు పూర్తి చేసింది.వాళ్ల అత్తమామలకు పిల్లలు లేరు కాబట్టి సీతను తీసుకువచ్చి పెంచుకున్నారు.అయితే సీత వచ్చిన కొద్దికాలానికే, అత్తమామలకు పిల్లలు పుట్టారు.అప్పటివరకు ప్రేమగా చూసుకున్న అత్త,“సీత వల్ల మన పిల్లలను సరిగ్గా చూడలేకపోతున్నాం” అని భర్తతో గొడవలు పడేది.అంతే కాదు…సీతతోనే అంట్లు తోమించేది,ఇంటి పనులన్నీ సీతతోనే చేయించేది.తన పిల్లల్ని మాత్రం ఎంతో ప్రేమగా చూసుకునేది.అలా మూడో తరగతి నుంచి ఇంటర్ వరకు సీత జీవితం సాగింది.---ఇంటర్ పాస్ అయింది.ఎంసెట్ కోచింగ్ తీసుకుంది.ఎంసెట్