మరణ శాసనం లిఖిస్తే... మరణం తప్పదా? - 5

(325)
  • 2.9k
  • 1.2k

గురునాదం మాస్టర్ ఎవరికోసమో వచ్చారు అనుకొని నా పనులు చేసుకుంటున్నాను. నేను స్కూలుకు వెళ్లే రోజుల్లో, సార్ పాఠం చెబుతుంటే పిల్లలందరూ పాఠం వినకుండా అల్లరి చేసే వాళ్ళు, ఆడుకునేవాళ్లు అయినా మాస్టారు కోప్పపడకుండా పాఠం పీరియడ్ అయిపోయే వరకు చెప్పి వెళ్లేవారు. ఆయన ముఖంలో ఏనాడు చీకాకు గాని, కోపం గాని చూడనే లేదు. దాదాపు 55 సంవత్సరాల వయస్సు ఉంటుంది. "కార్తీక్ "అనే పిలుపుతో తల ఎత్తి పైకి చూశాను. "నమస్తే సార్" అని పలకరించాను. కుర్చీ వేశాను.. కుర్చీలో కూర్చుని, "ఎలా ఉన్నావు, కార్తీక్? స్కూలుకు రావడం లేదు ఎందుకు?" అని అడిగాడు. జరిగిన విషయం అంతా చెప్పాను. అంతా విని, "నేను నీ జీవితాన్ని మార్చలేకపోవచ్చు, కానీ కొన్ని విషయాలు మాత్రం చెప్తాను. జీవితంలో గుర్తుపెట్టుకో! చదువును కొనసాగించు. చదువు కోసం నువ్వు స్కూలుకు రానవసరం లేదు. పని చేసుకుంటూనే పుస్తకాలు తీసుకొని రాత్రిపూట చదువుకో! ఏమైనా అనుమానాలు