ఎపిసోడ్ 5 శాపగ్రస్తుడుఆ పిడుగు శబ్దం గదిలోని గోడలను మాత్రమే కాదు, మేఘన గుండెను కూడా ముక్కలు చేసినంత పనైంది. బయట కురుస్తున్న భారీ వర్షం సృష్టించే హోరు కంటే, ఆద్విక్ కళ్ళలో కనిపిస్తున్న నిశబ్ద ప్రళయం మరింత భయానకంగా ఉంది. ఆ గదిలో ఉన్న పాత బల్బు వోల్టేజ్ తగ్గి మినుకుమినుకుమంటూ వెలుగుతోంది, ఆ వెలుగు నీడల మధ్య ఆద్విక్ ముఖం రక్తం మరకలతో, అంతకు మించిన ఆగ్రహంతో భయంకరంగా కనిపిస్తోంది.మేఘన పెదాలు వణికాయి. ఆమె కనురెప్పల అంచుల నుండి జారిన నీటిబొట్టు, చెంప మీద ఉన్న మట్టి మరకని శుభ్రం చేస్తూ కిందకు జారింది. ఆమె చూపు ఆద్విక్ రొమ్ము మీద పడి ఉన్న ఆ ఫోటో వైపు వెళ్ళింది. అది పాతబడిపోయిన బ్లాక్ అండ్ వైట్ ఫోటో. అందులో తన తండ్రి చిరునవ్వుతో ఉన్నాడు. కానీ పక్కన ఉన్న వ్యక్తిని తను ఎప్పుడూ చూడలేదు. ఆద్విక్ ఆ