నీతో బంధమే రాసిందేవ్వరో ? - 2

(95)
  • 3.5k
  • 1k

​సీత గారు తన రామ్ వైపు ఒక చూపు చూస్తూ.. "నిజమే మావయ్య! అందరూ మీలా ఉండరులే.."అన్నారు....ఆ చూపులోని పరమార్థం గ్రహించిన రామ్ గారు . "ఏంటి సీత, నా ముఖం చూసి చెప్తావు? అంటే నేను నీతో ప్రేమగా ఉండటం లేదా?" అని అమాయకంగా, కాస్త నిలదీస్తున్నట్టు అడిగారు......​దానికి సీత గారు ఎంతో క్యూట్‌గా బదులిస్తూ.. "ప్రేమగా ఉండటం ఏంటండీ.. నన్ను ప్రాణంగా చూసుకుంటారు! కానీ.. అప్పుడప్పుడూ ఇలాగే పిచ్చి పట్టినట్టు అరుస్తూ ఉంటారు కదా," అని ఆటపట్టించారు. ఆ మాటతో అక్కడ ఒక్కసారిగా నవ్వేశారు....."చాల్లేరా.. రోజంతా ఇలాగే మాట్లాడుకుంటూ ఉండిపోదామా ఏంటి? పూజ టైమ్ అవుతోంది.. పంతులుగారికి ఫోన్ చేశావా?" అని జానకిగారు అడగగానే.... "చేశానమ్మా, దారిలో ఉన్నారంట,"...అని రామ్ గారు సమాధానం చెప్పగానే.... అందరూ త్వరగా రెడీ అవ్వడనైకి తమ గదుల్లోకి వెళ్ళిపోయారు....మనాలి చలి గాలిని ఎంజాయ్ చేస్తూ,ఫ్యామిలీ అంతా కలిసి హిడింబి దేవి ఆలయానికి చేరుకున్నారు. అది శుక్రవారం