వెన్నెల పూలు ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ “ఆ రోజు అతను చూసిన విషయం ఎంత తీవ్రమైనదంటే, అది జీర్ణం చేసుకోలేక అలా బ్లాంక్ గా మారిపోయాడు. మనం హిప్నటైజ్ చేసి తనకి అన్నీ గుర్తుకు వచ్చేలా చేసినప్పుడు, అదీ గుర్తుకు వస్తుంది. కాకపోతే అది ఎటువంటి అఫెక్ట్ చూపిస్తుందో ఇప్పుడు అంచనా వెయ్యలేం. మళ్ళీ బ్లాంక్ మ్యాడ్ గా మరొచ్చు. లేదూ వయొలెంట్ గా మనం కంట్రోల్ చెయ్యలేకుండా మారొచ్చు. అప్పుడు సెల్ఫ్ డామేజ్ చేసుకోవచ్చు. లేదా ఎవరినన్నా డామేజ్ చెయ్యొచ్చు కూడా. అందువల్ల హిప్నటైజ్ చేసి అతనికి అన్నీ గుర్తుకు వచ్చేలా చెయ్యడం ప్రస్తుతానికి అయితే మంచిది కాదు." ఎం మాట్లాడాలో తెలియనట్టుగా శకుంతల, సుస్మిత మరోసారి ఒకళ్ళ మొహాల్లోకి ఒకళ్ళు చూసుకున్నారు. “ఇది కేవలం ప్రస్తుతానికి సంభందించి మాత్రమే. భవిష్యత్తులో అతనిని హిప్నటైజ్ చేసి