వెన్నెల పూలు ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ “నా పరిస్థితి కూడా అదే. నాతొ ఎంత ప్రేమగా అభిమానం గా వున్నా, కొన్ని విషయాల్లో చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. నాకేదో చాలా పెద్ద సంబంధం తెచ్చి పెళ్ళిచెయ్యాలని ఆలోచిస్తూందనుకుంటాను. ఇప్పుడు మన ప్రేమ విషయం చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందో బోధపడడం లేదు.” డ్రెస్ చేసుకోవడం పూర్తయి అక్కడవున్న కుర్చీలో కూలబడింది సుస్మిత. “నీ బ్రో కి అలా కాకుండావుండివుంటే ఎంత బావుండేదో. మన ప్రేమ విషయం నీ మామ్ తో మాట్లాడతానని మాట కూడా ఇచ్చాడు.” తనూ లేచి డ్రెస్ చేసుకోవడం పూర్తి చేసుకుని బెడ్ మీద ఎడ్జ్ లో కూచుంటూ అన్నాడు శరత్. “బ్రో గురించి ఆలోచిస్తూంటే ఏం తోచడం లేదు. ఏం చెయ్యాలో బోధపడడం లేదు.” సడన్ గా ఆందోళనతో నిండిపోయింది సుస్మిత మొహం.