ఎవరు....? - 4

  • 1k
  • 297

Part - 4సమయం అర్ధరాత్రీ 1 గంట…ఇబ్రహీంపట్నం ఇండస్ట్రియల్ ఔటస్కర్ట్స్ (industrial outskirts)ఎక్కడికక్కడ ఖాళీగా రేకుల షెడ్డులు పడున్నాయి.దూరంగా కుక్కలు మొరుగుతున్న శబ్దం…సరిగ్గ ఆ సమయంలొ ఒక పోలీసు వాహనం వచ్చి రోడ్డు ప్రక్కకు ఆగింది. అర్ధరాత్రి పూట అక్కడ పెద్దగా ఎవరు ఉండరు కాబట్టి రోడ్డు మొత్తం చీకటిగా నిర్మానుష్యంగా ఉంది.ఆ చీకట్లొని పోలీసు బండి హెడ్లైట్స వెలుతురొ ఒక వ్యక్తిని చేతులు కట్టేసి బండ్లో నుండి బయటకి లాక్కోని వచ్చి ఎదురుగా నిలబెట్టారు. అదె పోలీసు బండిలొ డ్రైవర్ ప్రక్కనున్న సీటు నుంచి 36 ఏళ్ళ వయసున్న ఏ.సీ.పి అజయ్ (ACP Ajay) దిగాడు. చేతులు కట్టి ఉన్న వ్యక్తి : సర్ నేను ఏ తప్పు చేయలేదు సర్. దయచేసి నన్ను వదిలేయండి సర్.ఏ.సీ.పి అజయ్ (ACP Ajay) : నేరం చేసి పట్టుబడ్డ ప్రతి వాడు చెప్పె మాటెరా ఇదిఅని తన రివాల్వర్ బయటకు తీసి అందులోకి బుల్లెట్సను ఎక్కిస్తున్నాడు.రివాల్వర్