వెన్నెల పూలు ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ కానీ ఆ రోజు రాత్రంతా ఆ నలభై ఐదు ఏళ్ల వాడితో గడిపాక అందుకు కారణం బోధపడింది. సెకను కూడా వృధా చెయ్యకుండా ఆ రోజంతా వాడు తనని రాక్షసం గా అనుభవించాడు. “తక్కువ డబ్బిచ్చి నిన్నీరోజు కి కొనుక్కోలేదు. నువ్వేమాత్రం ప్రతిఘటించినా నీ తల్లికి చూపించిన నరకమే నీకూ చూపిస్తాను.” ఎక్కడన్నా నొప్పిగా అనిపించి తను అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పుడల్లా వాడు అన్నాడు. తెల్లవారాక మిగిలిన డబ్బు తన అమ్మమ్మకి ఇస్తూ వాడు అసంతృప్తిగా మాట్లాడినా, వాడిలో తృప్తి తనకి తెలుస్తూనే వుంది. ఆ రోజంతా కుదిరినప్పుడల్లా తనని పట్టుకుని ఏడుస్తూనే వుంది తన తల్లి. “ఇలాంటి బతుకు బతకడం కన్నా చావడం మంచిది. ఆలా చచ్చే ధైర్యం లేక ఇలా బతికున్నాం. నన్ను క్షమించమ్మా. నీ కన్నతల్లిని అయివుండీ ఆ