వెన్నెల పూలు - 11

  • 204
  • 57

వెన్నెల పూలు ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ “ఒక్క విషయం మీరు ముగ్గురూ గుర్తుపెట్టుకోండి.” కొంచెం ఆగాక మళ్ళీ వినిపించింది ఫోన్ లోనుండి ఆ గొంతు. “నా వల్ల మీ కుటుంబం ఈ వేళ ఇలా వుంది. లేకపోతె ఎప్పుడో రోడ్డునపడి ఉండేవారు. నాకేమన్నా వ్యతిరేకంగా చెయ్యాలని చూస్తే మిమ్మల్ని ఎలా చంపుతానో మీరూహించలేరు. నాకు నమ్మక ద్రోహం చేసేవాళ్ళని నేను ఏం చేస్తానో త్వరలోనే మీకుతెలుస్తుంది .” చీఫ్ ఎవరిని ఉద్దేశించి ఆ మాటలు అన్నాడో ముగ్గురికీ అర్ధమయ్యి, వాళ్ళ హృదయాల్లో భయం ఇంకా ఎక్కువ అయిపోయింది . “అలా ఎందుకు ఆలోచిస్తారు చీఫ్? మీకు ద్రోహం చెయ్యాలన్న ఆలోచన మాకు కలలో కూడా రాదు.” భుజంగరావు అన్నాడు. “మన అందరికీ అంత పెద్ద సమస్య అయిన ఆ అరవింద్ ని ప్రాణాలతో ఉంచడం ఎందుకు? వాడిని లేపేస్తే