వెన్నెల పూలు - 12

  • 918
  • 321

వెన్నెల పూలు ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ దీర్ఘం గా నిట్టూర్చి కుర్చీలో వెనక్కి జారగిలబడ్డాడు అభినవ్. "మీలో లోపం ఉందని మీకు ఎప్పుడు తెలిసింది?" తనూజ అడిగింది "పెళ్లయ్యేవరకూ తెలీదు. తెలిసిఉంటే నేనసలు పెళ్లిచేసుకునేవాడినే కాదు." నిట్టూర్చాడు అభినవ్. “మీలో సమస్య ఉందని మీకు పెళ్లయ్యాకే గదా తెలిసింది? మీరెవరన్న సెక్స్ స్పెషలిస్ట్ ని చూసే అవకాశం ఇచ్చిందా ఆ అమ్మాయి?” “నాలోనే సమస్య ఉందని మీరెలా ఊహించారు ముందే?” “ఈ ఇంపొటెన్సీ అన్నది నూటికి తొంభై శాతం మగాళ్లకే ఆపాదించబడుతుంది. అదీ కేవలం అపోహలతో, అర్ధం చేసుకోలేక. కానీ పరిశోధనల్లో తేలిందేమిటి అంటే అసలు ఇంపొటెన్సీ అన్నదే లేదు.” “లేదు మేడం. నేను నిజంగానే ఇంపోటెంట్. తనకది నేను అసలు చెయ్యలేకపోయాను. తన ఫ్రస్ట్రేషన్ లో న్యాయం వుంది.” వేదనగా అన్నాడు అభినవ్. “కానీ మీరు ఇంపోటెంట్