పది నిమిషాల తర్వాత తన స్నేహితుల దగ్గరికి చేరుకొని—“ఈ విధ్వంసానికి కారణం ఎవరు? అసలు ఏం జరిగింది? నాకు తెలుసుకోవాలి!” అని గట్టిగా అన్నాడు.అప్పుడు ఒక స్నేహితుడు మెల్లగా చెప్పాడు:“పేరు తెలియదు… కానీ వాడికి గుండె లేదు అని మాత్రం తెలుసు.”ఇంకొకడు వెంటనే—“ఇలా కాదు… పదండి, నేను చూపిస్తా” అని, ప్రవీణ్‌ని తీసుకెళ్లాడు.అసిఫ్ లోపలికి వెళ్లి ఎవరో ఒకరితో మాట్లాడి, అంధకారమై ఉన్న గదిలో ప్రవీణ్‌ని కూర్చోబెట్టాడు.అక్కడ కూర్చున్నాడు— వయసు దాదాపు 99 సంవత్సరాలు ఉన్న వృద్ధుడు.ముఖం ముడతలు, శరీరం బలహీనంగా ఉన్నా, కళ్ళలో మాత్రం ఎవరికి అర్థం కాని ధైర్యం, ఓ గట్టి వెలుగు ఉంది.ఆ వృద్ధుడు మెల్లగా అడిగాడు:“ఏంటి బాబు… ఏం కావాలి?”ప్రవీణ్ జడుసుకుంటూ అన్నాడు:“తాతయ్య… మీకు భాష గంగోలి డాన్స్ గురించి తెలుసు కదా?అసలు భాష కాళ్లు, చేతులు నరికిన వ్యక్తి ఎవరో… మీరు చెప్పగలరా?”వృద్ధుడు ఒక్క క్షణం మౌనం వహించి, చిన్నగా నవ్వాడు.“అధిక ప్రేమ… గుడ్డి