అసంపూర్ణ కావ్యం - 4

  • 321
  • 99

సరిగ్గా అప్పుడే లోపల నుండి జానకి గారు, ఆమె పెద్ద కొడుకు రాజు బయటకు వచ్చారు. బయట జరుగుతున్న రభస చూసి రాజు కంగారుగా పరుగెత్తుకు వచ్చాడు. "ఎందుకురా అలా అరుస్తున్నావు? ఏమైంది?" అని రాజు అడగ్గా.. "చూడు అన్నయ్యా! ఈ అమ్మాయి ఎవరో నాకు తెలీదు, కానీ ఎప్పటి నుంచో తెలిసినట్టు పలకరిస్తోంది. ఏదో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతోంది!" అని కిషోర్ విసుక్కున్నాడురాజు వెన్నెల కళ్ళలోని నిస్సహాయతను చూసి పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. అతని కళ్ళలో ఏదో తెలియని జాలి మెరిసింది. "నువ్వు లోపలికి వెళ్ళు కిషోర్.. నేను మాట్లాడుతాను" అని తమ్ముడిని లోపలికి పంపివేసి, వెన్నెల వైపు తిరిగాడు. "లోపలికి రామ్మా.. వెన్నెలా.." అని ఆదరంగా పిలిచాడు. జానకి గారు మౌనంగా వెళ్లి నీళ్లు తెచ్చి వెన్నెలకు ఇచ్చారు. ఆమె చేతులు వణుకుతుంటే, ఆ నీళ్ల గ్లాసును అందుకోవడానికి కూడా వెన్నెలకు శక్తి లేకపోయింది. ఆ గదిలో ఆవరించిన నిశ్శబ్దం