వెన్నెల పూలు - 14

  • 255
  • 93

వెన్నెల పూలు ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ "మేమూ అదే అనుకుంటున్నాం. మేము ఆ చింటూ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. వాడు దొరికినా చాలా ప్రశ్నలకి సమాధానాలు తెలుస్తాయి." అలా అన్నాక ఇంకా మాట్లాడాల్సినది ఏమీ లేదనుకుని కుర్చీలోనుంచి లేచింది సుస్మిత. ఆమెతో పాటుగా తామూ లేచారు భుజంగరావు, రేవతి, ఇంకా చక్రవర్తి కూడా. "ఎలాంటి సాయం కావాల్సి వచ్చినా మొహమ్మాట పడకుండా అడగండి. మేమున్నామని మర్చిపోవద్దు. మేము మీ కుటుంబానికి చాలా కావాల్సినవాళ్ళం." సుస్మిత వెనగ్గా వస్తూ అన్నాడు భుజంగరావు. "థాంక్ యూ అంకుల్, గుర్తున్చుకుంటాను." అలా అన్నాక అక్కడనుండి వేగంగా వెళ్ళిపోయింది సుస్మిత.       "మనకి ఏదీ తెలియనట్టుగా బాగా నటించాం కదా." మళ్ళీ అందరూ వచ్చి కుర్చీల్లో సెటిల్ అయ్యాక చక్రవర్తి అన్నాడు. "మన తెలివితేటలూ అవసరమైన చోట తప్ప అన్నిచోట్లా పనిచేస్తాయి." చిరాగ్గా