ఆర్య ఆఫీస్ నుండి ఇంటికి రాగానే, సుస్మిత వడ్డించిన భోజనం తింటూ ఉదయం నుండి జరిగిన విషయాలన్నీ వింటున్నాడు. సుస్మిత చెబుతున్న మాటలు ఒక ఎత్తైతే, ఆర్య ఆలోచనలు మరొక ఎత్తులో ఉన్నాయి. తన చెల్లి నీలా ప్రవర్తనలో కనిపిస్తున్న ఆ మార్పు అతనికి అంతుచిక్కడం లేదు.మరుసటి రోజు ఉదయం.. సూర్యుడు తన పనుల్లో తాను బిజీగా ఉన్నట్టే, ఇంట్లో అందరూ ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉన్నారు. నీలా కాలేజీకి రెడీ అయి హాల్‌లోకి రాగానే ఒక్కసారిగా ఆగిపోయింది. అక్కడ సోఫాలో షీలా, అయాన్ కూర్చుని ఏదో సీరియస్‌గా మాట్లాడుకుంటున్నారు. అది చూసి చూడనట్టుగా షీలాను పలకరించి, లోపలికి టిఫిన్ చేయడానికి వెళ్ళింది నీలా.టిఫిన్ తింటున్నట్టు నటిస్తోందే కానీ, నీలా మనసు లోపల ఉప్మా లాగా ఉడికిపోతోంది. తన అయాన్‌తో షీలా అంతలా ఏం మాట్లాడుతోంది? ఆర్య తన గదిలో ఉన్నాడని తెలిసి, తన కోపాన్ని బయట పడకుండా మేనేజ్