అసంపూర్ణ కావ్యం - 5

  • 192
  • 72

అలా కొన్ని రోజులు వెన్నెల, కిషోర్ మధ్య మౌనమైనా, మనసులకి చేరువైన స్నేహం ఎంతో అందంగా గడిచింది. కానీ, లోకం ఎప్పుడూ ఇతరుల ఆనందాన్ని చూసి ఓర్వలేదు కదా! ఒకరోజు వెన్నెల ఎప్పటిలాగే కిషోర్ ఇంటికి వెళ్తుంటే, వీధి చివర ఉన్న కొందరు మనుషులు మళ్ళీ నోళ్లు పారేసుకున్నారు. "చూడండి.. ఆ మొక్కల పిచ్చిది వెళ్తోంది! దీనికి తోడు తోటలో ఇంకో మొక్కల పిచ్చోడు తోడయ్యాడు. ఇద్దరికీ పిచ్చి బాగా ముదిరినట్టుంది" అంటూ బిగ్గరగా హేళన చేశారు.ఆ మాటలు వెన్నెల చెవిన పడకముందే, వెనుక వస్తున్న శారదమ్మ గుండెల్లో మంటలు రేపాయి. ఇన్నాళ్లూ తన బిడ్డ గురించి వింటున్న వెటకారాలు, గుసగుసలు ఒక ఎత్తైతే, ఇప్పుడు నేరుగా చేస్తున్న ఈ అవమానం ఆమె సహనాన్ని పరీక్షించింది. శారదమ్మకు ఉన్న ఓపిక ఒక్కసారిగా నశించిపోయింది. "ఎవరది? నా బిడ్డ గురించి అంత మాట అన్నది ఎవరు?" అంటూ ఆమె ఒక సింహంలా గర్జించింది.ఎప్పుడూ