వెన్నెల పూలు ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ "ఇందులో నాకు ఏ స్వార్ధం లేదని చెప్పను. ఆయనతో నీ పెళ్లయ్యాక నువ్వు నాకూ సహాయ పడుదువు గానీ. ఇద్దరం కలిసి ఎదుగుదాం." "మరి మన ప్రేమ, పెళ్ళీ ............" తను ఎలా మాట్లాడుతూందో తనకే బోధపడ్డం లేదు. "మన పెళ్లి గురించి ఆలోచించకు. ఇంక ప్రేమ, నీ మీద నాకు అది కొండంత వుంది. ఆయనతో పెళ్లయ్యాక నువ్వు నాకు దూరం అవుతానేమోనని ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం ఇద్దరం కలిసి సుఖం అనుభవించడానికి కావలిసినన్ని మార్గాలు వున్నాయి." తనని దగ్గరికి తీసుకోవడానికి ప్రయత్నిస్తూ అన్నాడు వాడు. “నన్ను ముట్టుకోకురా వెధవా!” వాడిని బలంగా వెనక్కి తోస్తూ అరిచింది తను. అప్పటికి విషయం అంతా అర్ధం అయింది తనకి. షాక్ లోనుండి బయటకి వచ్చింది. “నా పదమూడేళ్ళ వయసులో నన్ను