అసంపూర్ణ కావ్యం - 8

ఆమె కళ్లలో నుండి కన్నీళ్లు నేల రాలకముందే, ఆకాశం ఆమె బాధను పంచుకుంటున్నట్టుగా జోరుగా వర్షం మొదలైంది. ఆ వాన చినుకుల్లో తన కన్నీళ్లను దాచుకుంటూ, వెన్నెల ఆ తోటలోనే ప్రకృతిలో ఒక్కటిగా కరిగిపోయింది. గాలికి ఊగుతున్న ఆ నీలం గులాబీ మొక్క కూడా ఆమెతో పాటే వెక్కి వెక్కి ఏడుస్తున్నట్టుగా తోచింది.జోరున కురుస్తున్న ఆ వానలో తన కన్నీళ్లు ఎవరికీ కనిపించవని వెన్నెల అనుకుంది. కానీ తన గుండెల్లో రగులుతున్న ఆవేదన ఆ వాన చినుకుల కంటే వేగంగా ప్రవహిస్తోంది. ఆవేశం, ఆవేదన కలగలిసిన స్థితిలో కిషోర్ ముందుకు వెళ్లి నిలబడింది. తడిసిన జుట్టు, వణుకుతున్న పెదవులతో అతన్ని నిలదీసింది."ఎందుకు ఇలా చేశావు కిషోర్ గారు? నాతో మాట్లాడటం ఇష్టం లేకపోతే ఆ రోజే ముందే చెప్పొచ్చు కదా! అబద్ధపు ప్రేమికురాలిని సృష్టించి నన్ను ఎందుకు వంచించావు? నీ జ్ఞాపకాలు మసకబారినా నా స్నేహం నీకు తోడుంటుందని నిన్ను ఎంతగా