వెన్నెల పూలు - 19

  • 999
  • 246

వెన్నెల పూలు ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ "మీరెవరూ నాకు పరాయి మనుషులు కారు. మీరు పేస్ చేసేది ప్రతీదీ నేనూ ఆనందంగా పేస్ చేస్తాను." ప్రమీల అంది. "నీ అక్కకి ఇక్కడ ఏ ఇబ్బందీ లేకుండా చూసుకునే పూచీ నీదే." సమీర మొహం లోకి చూస్తూ అన్నాక అక్కడనుండి వెళ్ళిపోయింది శకుంతల. "పద అక్కా మళ్ళీ నీ రూమ్ లోకి. అక్కడ నీకు ఏ ఇబ్బందీ లేకుండా చూసుకుంటాను." తనూజ కుడిభుజం మీద చెయ్యివేసి నవ్వుతూ అంది సమీర. ఇద్దరూ నవ్వుకుంటూ తనూజ రూమ్ లోకి నడిచారు మళ్ళీ.    &&& శకుంతల మళ్ళీ అదే రూమ్ లో అదే గదిలో వుంది. ఇదే గదిలో తనకీ, వర్ధన్ వర్మకి మొదటిరాత్రి జరిగింది. ఆ మొదటిరాత్రి నే కాదు, ఆ రోజు తామిద్దరిమధ్య జరిగిన  సంభాషణని కూడా తనెప్పుడూ మర్చిపోలేదు.