వెన్నెల పూలు - 20

  • 444
  • 102

వెన్నెల పూలు ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ "వాడు తన మీద తను నమ్మకం కోల్పోయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నాడు. సో, అలా చేసి వాడిమీద వాడికి నమ్మకం కలిగించడం లో తప్పులేదనిపించింది." అలా చెపుతూంటే తనూజ బుగ్గలు సిగ్గుతో ఎర్రబడిపోయాయి. "ఆల్రైట్. ఇప్పుడు అసలు సమస్య ఏమిటి? నువ్వు దేనిగురించి ఆందోళన పడుతున్నావ్?" అని అడిగింది సమీర. "వాడిప్పుడు నన్నే పెళ్లిచేసుకుంటానని కూచున్నాడు. నన్ను ప్రేమిస్తున్నానంటున్నాడు." చిరాకు ఎక్కువ అయిపోయింది తనూజలో. నవ్వకుండా వుండలేకపోయింది సమీర. నవ్వాపుకుని అంది. "రీజనబుల్ గానే ఉందికదక్కా. మగాడిని కాదనుకుని నిస్పృహలోకి వెళ్ళిపోతున్నవాడిని, నువ్వు ఎవరూ చేయనిది చేసి నమ్మకం కలిగించావు. ఇద్దరు భార్యాభర్తల మధ్య జరగాల్సినదే, మీ ఇద్దరి మధ్య జరిగింది. నిన్నుతను పెళ్లిచేసుకుందామనుకోవడం లో తప్పేముంది?" "మా ఇద్దరి మధ్య చాలా ఏజ్ గాప్ వుంది. ఎలా పెళ్లి చేసుకోమంటావ్?"