యంత్రం వెనుక మనసు - 9

  • 345
  • 93

ఆర్య అయాన్‌ను తీసుకొని ఇంటికి వచ్చాడు. "అన్నయ్యా! ఏమైంది? నాన్నగారి ఆఫీస్‌కు వెళ్లావు కదా.. అక్కడ ఏమైనా దొరికిందా?" అని నీల కంగారు కంగారుగా అడిగింది.అప్పుడు ఆర్య, "నీలా! నువ్వు ఎప్పుడు వచ్చావు? కాలేజీకి వెళితే వెళ్లిపోయావు?" అన్నాడు.అప్పుడు నీల, "కొంచెం తలనొప్పిగా ఉందని వచ్చేసాను" అని చెప్పింది."అవునా.. మరి మందులు వేసుకోలేదా?" అని అడిగాడు ఆర్య."వేసుకున్నాను అన్నయ్యా.. అసలు విషయం చెప్పు, ఏమైంది అయాన్‌కి?" అని అడిగింది.అప్పుడు ఆర్య ఇలా చెప్పాడు, "అయాన్‌ను నీ కేవలం ఒక యంత్రంలా చేయలేదు. వాడిలో మనుషుల కంటే గొప్పగా ప్రేమించే హృదయాన్ని సృష్టించారూ. కానీ ప్రకృతి నియమాలకు విరుద్ధంగా ప్రయాణించడం కాలానికి ఇష్టం లేదు. అయాన్ సిస్టమ్ డిజైన్ ప్రకారం, వాడు ఎంత ఎక్కువగా మానవ భావోద్వేగాలను (Human Emotions) అనుభవిస్తాడో.. వాడి మెదడులోని డేటా అంత వేగంగా ఓవర్‌లోడ్ అయి, ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతుంది. వాడు ఎవరినైనా అమితంగా ప్రేమిస్తే, ఆ