వెన్నెల పూలు ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ అది విని నవ్వింది సమీర. "ఇంకొంచెం కాలం మాత్రమే వెయిట్ చేద్దాం. అప్పటికీ అతనికేమీ గుర్తుకు రాకపోతే, హిప్నోసిస్ లోకి పంపి అంతా గుర్తుకు వచ్చేలా చేస్తాను." "ఐ యాం కాన్ఫిడెంట్. నీకు అదేం పెద్ద కష్టమైనా విషయం కాదు." తనూజ కూడా సమీర మొహం లోకి చూస్తూ అంది. కొంత నిశబ్దం చోటుచేసుకుంది అక్కడ, ఆ ముగ్గురు ఏం మాట్లాడాలో తోచక సైలెంట్ గా ఉండిపోవడం వల్ల. సడన్ గా ఆ నిశబ్దాన్ని బ్రేక్ చేసింది సమీర. "ఒక్క విషయం సుస్మితా." సుస్మిత మొహం లోకి చూస్తూ అంది సమీర. "నీ మామ్ గురించి నీకు ఎంతవరకూ తెలుసు?" "తను చాలా ఇంటెలిజెంట్ అండ్ డిస్సిప్లైన్డ్. కంపెనీ వ్యవహారాలు ఎంత చక్కగా చూడగలదో, ఇంటి వ్యవహారాలు అంత చక్కగానూ చూడగలదు.