వెన్నెల పూలు ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ "అంతేకాదు సమీ. ఎప్పుడన్నా మనం ఎవరం లేనప్పుడు ఏదన్నా స్ట్రేంజ్ ప్లేస్ లో అంతా సడన్గా గుర్తుకువచ్చేసినా కూడా ప్రాబ్లెమ్ గానే ఉంటుంది. అంతకన్నా ప్లాన్డ్ గా హిప్నోసిస్ లోకి పంపి ఆ విషయం తో పాటుగా అతనికి అన్నీ గుర్తుకు వచ్చేలా చెయ్యడం బెటరే." "ఎక్జాట్లీ సర్. నా ఉద్దేశం అదే." సమీర తలూపి అంది. "ఈ విషయం లో మీ అభిప్రాయం తెలుసుకోవాలనే ఇప్పుడు మీతో దీనిగురించి మాట్లాడాను." "నా అభిప్రాయం లో కూడా అరవింద్ సఫర్ అవుతూవుంటే ప్రయత్నంతో అతనికన్నీ గుర్తుకొచ్చేలా చేసేడమే మంచిది. నువ్వు ఆలోచిస్తూన్నదీ నిజమే. అతని వైఫ్ గా నీ ఎమోషన్ కూడా నాకు అర్ధం అయింది. కానీ జీవితంలో మనం కొన్ని పరిణామాలు ఎదుర్కోక తప్పదు." "థాంక్ యు వెరీ మచ్