వెన్నెల పూలు - 23

  • 60

వెన్నెల పూలు ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ "నేను కూడా అంతే వదినా." సుస్మిత అంది. "ఇంతకీ నువ్వెప్పుడు అది చేద్దామనుకుంటున్నావ్? ఎక్కడ?" "వన్ ఆర్ టు డేస్ లో. బ్లాక్ యాంట్ మెంటల్ కేర్ లో. నేను మీకు చెప్తాను. మీరందరూ అక్కడ వుండొచ్చుకూడా." అలా అన్నాక ఇంక తర్వాత అడగబోయే ప్రశ్నలకి సమాధానం చెప్పడం ఇష్టం లెదన్నుట్టుగా లేచినిలబడింది సమీర. "వస్తా మరి. మెంటల్ కేర్ కి వెళ్ళాలి. అక్కడ అటెండ్ కావాల్సిన కేసెస్ వున్నాయి." "యూజెలెస్ ఫెలో. పనయ్యాక బయటకి పొమ్మని కూడా నేనే చెప్పాలి. పో అవతలకి." శకుంతల టిబ్బూ మీద అరవడం వినిపించింది బయటకి వచ్చేస్తున్న సమీర కి. "మేడం ..........." తన గదిలోకి అడుగుపెట్టబోతూవున్న సమీర టిబ్బూ గొంతువిని వెనక్కి తిరిగింది. "ఏంటి టిబ్బూ?" టిబ్బూ మొహం లోకి చిరునవ్వుతో చూస్తూ