వెన్నెల పూలు - 24

  • 90

వెన్నెల పూలు ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ "నా ప్రేమ మీద నమ్మకం ఉంటే నువ్వు వేరే ప్రశ్నలు అడగకుండా నాకా ప్రామిస్ చెయ్యి." శరత్ తన చేతిని అలాగే ఉంచి అన్నాడు. సుస్మిత అదే కోపం తో ఇంకా ఎదో అనబోతూ ఉండగా అరవింద్ అన్నాడు. "ప్లీజ్ నువ్వా ప్రామిస్ చేసేయ్. నేనిక్కడ ఎక్కువసేపు కూచోలేకపోతున్నా. ఇది త్వరగా పూర్తికానిద్దాం." గట్టిగా ఊపిరి పీల్చి వదిలి శరత్ కుడిచేతిలో తన కుడిచేతిని పెట్టి "ఒకే. ఐ ప్రామిస్ యు దట్, ఇనఫ్?" అని తన చేతిని తీసేసాక సమీర వైపు చూస్తూ అంది. "వదినా, స్టార్ట్ ఇట్ ఎట్ లీస్ట్ నౌ." "ఆల్రైట్. ఐ స్టార్ట్ ఇట్ నౌ." అంటూ అక్కడ వున్నా ఆడియన్స్ వైపు చూస్తూ అంది. "మీరెవ్వరూ ఏం మాట్లాడకూడదు. ఎలాంటి డిస్టర్బన్స్ క్రియేట్ చెయ్యకూడదు.