వెన్నెల పూలు ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ "వీడిని ఇప్పుడే చంపి పారేస్తే ఒక పని అయిపోతుంది. వీడు స్పృహలోకి వచ్చి మనవిషయం అంతా గుర్తుకొస్తే మనపని అయినట్టే" స్పృహ కోల్పోయివున్న అరవింద్ దగ్గరకి వెళుతూ అన్నాడు చలపతి. "ఆగు, నువ్వు నా కొడుకుని ఎమన్నా చేసావో, నీ బండారం అంతా బయట పెడతాను. ఎంతో కష్టపడి, మమ్మల్ని దోచుకుంటూ ఒక చీకటి సామ్రాజ్యం సృష్టించుకుని దానికి చీఫ్ వి అయ్యావు కదా. అదేదీ నీకు లేకుండా చేస్తాను. నేనలా చెయ్యగలను. నీకూ తెలుసు." డ్రెస్ చేసుకోవడం కూడా మర్చిపోయి, చలపతి దగ్గరకొచ్చి గట్టిగా అరిచింది శకుంతల. "నువ్వు నాతొ ఇలా వ్యభిచారిస్తున్నావని తెలిస్తే నీ మొహం మీద కూడా ఉమ్మేస్తాడు. ఆ విషయం మర్చిపోకు." కోపంగా అన్నాడు చలపతి. "నాలాంటి పాపిష్టి దానికి అలాంటి శిక్ష పడాల్సినదే. నిజానికి