యంత్రం వెనుక మనసు - 11

  • 303
  • 96

అంతలో ఆర్య అక్కడికి వచ్చి, "ఏంటి షీలా.. అలా నిల్చుని ఏం ఆలోచిస్తున్నావ్?" అని పలకరించాడు. అప్పుడే రాజు గారు కూడా అటుగా వస్తూ, "ఏమ్మా షీలా! ఎలా ఉన్నావ్?" అని ఎంతో ఆప్యాయంగా అడిగారు.అప్పుడు షీలా వినయంగా, "నమస్తే అంకుల్ గారు! నేను మిమ్మల్ని ఒక విషయం మీద కలవాలనుకుంటున్నాను" అంది.రాజు గారు ఆశ్చర్యంగా, "దేని గురించి అమ్మా షీలా?" అని అడిగారు."ఏం లేదు అంకుల్.. అది వచ్చి.." అని షీలా నసుగుతుంటే, నీల తట్టుకోలేక, "ఎందుకు చెప్పకుండా ఊరుకుంటావ్.. చెప్పేయ్!" అని కాస్త గట్టిగా అంది.నీల కోపాన్ని చూసి షీలా, "చూడండి అంకుల్ గారు! ఈ మధ్య నీల పద్ధతి అస్సలు బాలేదు. నన్ను చూస్తేనే చాలు.. కారాలు మిరియాలు నూరుతోంది!" అని రాజు గారికి కంప్లైంట్ చేసింది.రాజు గారు నవ్వుతూ, "సరేలేమ్మా.. ఇంతకీ నన్ను ఎందుకు కలవాలనుకుంటున్నావో చెప్పు షీలా?" అని అడిగారు.నీల కంగారు పడిపోతూ, "నాన్నగారూ!