ఎవరు....? - 9

  • 243
  • 63

Part - 9 విజయవాడ నగరానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో…..కొండపల్లి కొండల వెనుక…..పచ్చటి అడవులు, రాళ్ల గుట్టలు, లోయల మధ్య...బయటి ప్రపంచానికి దాదాపు దూరంగా బ్రతుకుతున్న చిన్న గిరిజన గ్రామం…"పొనికె గూడెం"అస్తమిస్తున్న సూర్యకిరణాలు ఆ గ్రామంపై పడుతుంటె. ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. వచ్చి సరిగ్గ ఆ "పొనికె గూడెం" గ్రామం మద్యన ఆగాడు. అక్కడ ఒక పెద్ద మఱ్ఱి చెట్టు క్రింద ఒక వ్యక్తి కూర్చున్నాడు. అతని పేరు "చెంచయ్య" ఆ గ్రామం పెద్ద అందుకె అతన్నీ అందరు పెద్దయ్యా అని కూడా పిలుస్తారు .అతని చుట్టూ కొంత మంది గ్రామ ప్రజలు క్రింద కూర్చున్నారు. ఆ పరిగెత్తుకుంటూ వచ్చిన వ్యక్తిని చెంచయ్య చూశాడు. అతను ఊపిరి సలుపుకుంటూ వచ్చి చెంచయ్య కాళ్ళ దగ్గర కూలబడ్డాడు.చెంచయ్య : రేయి సాంబడు ఏటయనాది రా.? సాంబడు : పెద్దయ్య మన మల్లి..... మన మల్లి... మన మల్లి కడుపు పోయ్యిందయ్యా.. ఈ గూడెంలొ ఇంకొ ఆడబిడ్డ