వెంటాడే నీడలు - 3

వెంటాడే నీడలు ( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పారానార్మల్ థ్రిల్లర్) కొట్ర శివ రామ కృష్ణ "తను అప్పుడప్పుడు ఇలా బిహేవ్ చేస్తూంది. ఇలా ఒక మనిషి మీద డెడ్లీ అటాక్ చెయ్యడం ఇదే మొదటిసారి. మళ్ళీ ఇప్పట్లో ఇలా చేయకపోవచ్చు. నేనూ నాకు తెలిసిన సైకియాట్రిస్ట్ లతో అలోచించి చూస్తాను. ఇప్పట్లో, మనమంతా మరోసారి ఆలోచించకుండా ఈ విషయాల్ని తన దృష్టికి తీసుకెళ్లొద్దు." భుజంగరావు అన్నాడు. "నువ్వు చెప్పినట్టుగా శ్రవణ్ ఒకసారి ప్రమీల తో కదిపి చూస్తే మంచిది. ఎంత కాదన్నా తాను సైకాలజీ తో ఎం . ఏ. చేస్తూంది కదా ."      "నా అభిప్రాయమూ అదే. అవసరమైనప్పుడు అప్పుడప్పుడు తనెలా ఆడ్ గా బిహేవ్ చేస్తూంది తనకి చెప్దాము. ప్రస్తుతానికి కొంతకాలం వెయిట్ చేసి చూద్దాం." మాలతి అంది. అప్పుడు ఏం మాట్లాడాలో తెలియనట్టుగా, తక్కిన అందరూ కొంతసేపు నిశబ్దంగా ఉండిపోయారు.