రౌడీలు కూడా టీ తాగుతూ కార్తీక్ ను గమనించ సాగారు. వారికి వచ్చిన ఆదేశాలు ఏమిటంటే ఏదో కాకతాళీయంగా జరిగిన గొడవ లేదా ప్రమాదంలా ఉండాలి కార్తీక్ చావు. ఇంతలో అబ్దుల్లా వచ్చాడు. కార్తీక్ అబ్దుల్లా ఇద్దరు మాట్లాడుకుంటూ టీ తాగారు. ఇక ఇంటికి వెళదామని లేచి నిలబడి బయలుదేరారు. వారు వెళ్తున్నారు అని గమనించి రౌడీలలో ఒకడు టీ కప్పుతో కార్తీక్ ఎదురుగా వెళ్లి కావాలనే గుద్దాడు. టీ కప్పులోని టీ ఒలికిపోయింది. వెంటనే కార్తీక్ 'సారీ చూసుకోలేదు' అన్నాడు, తన తప్పు లేకపోయినా. "ఏరా కళ్ళు కనపడటం లేదా? మాలాంటి పేదవాళ్లంటే మీకు చులకన రా.. నీలాంటి ఒకనికి బుద్ధి చెబితే మిగతా వాళ్లకు బుద్ధి వస్తుంది "అంటూ లేచి చేతితో దోపుకున్న కత్తిని తీసి కార్తీక్ ను పొడవ పోయాడు. కార్తీక్ వేగంగా పక్కకు జరిగాడు. వీడు కావాలని ఇలా చేస్తున్నాడని అర్థమైంది. వెంటనే చేతితో వాడి చెంపపై గట్టిగా