యంత్రం వెనుక మనసు - 12

  • 207

అప్పుడు నీల గోడకు ఆనుకుని.. కొద్దిసేపటి క్రితం తను ప్రసాద్ అంకుల్‌తో ఫోన్‌లో మాట్లాడిన విషయాన్ని గుర్తుచేసుకుంది.నీల ఫోన్ చేయగానే ప్రసాద్ గారు ఎత్తారు. "చెప్పు నీలా! ప్రయోగశాలకు కాల్ చేశావు? నీ మొబైల్ నుండి ఎన్నిసార్లు ఫోన్ చేసినా నేను పనిలో ఉండి ఎత్తలేదు తల్లి.. నన్ను క్షమించు! ఇంతకీ విషయం ఏంటమ్మా? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు?" అని అడిగారు ప్రసాద్ గారు."అంతా బాగానే ఉన్నాం అంకుల్ గారు.. కానీ మీ అయాన్ పుట్టినరోజును మీరు మర్చిపోయారా?" అని నీల అడిగింది."అవును కదా! నా పరిశోధన పనిలో పడి పూర్తిగా మర్చిపోయాను అమ్మ.. సరే, నేను తప్పకుండా ఇప్పుడే బయల్దేరి వస్తున్నాను" అన్నారు ప్రసాద్ గారు.ఆ విధంగా ప్రసాద్ అంకుల్‌ను తానే సమయానికి పిలిపించి, అయాన్‌ను షీలా తీసుకెళ్లకుండా కాపాడుకున్నందుకు నీల తనలో తానే మురిసిపోతూ నవ్వుకుంది.నీల తన గత జ్ఞాపకాలను మరికొంచెం లోతుగా గుర్తుచేసుకుంది. ఫోన్‌లో ప్రసాద్