"ఇంకేం చేస్తాం అమ్మ.. ఈ అర్ధరాత్రి పూట ఎవరు తింటారు? తీసుకెళ్లి చెత్తబుట్టలో పారేద్దాం" అన్నాడు ఆర్య అలసటగా ముఖం పెట్టి."వద్దు అన్నయ్యా! అలా అస్సలు చేయొద్దు" అని నీల గట్టిగా వారించింది. "భోజనం దొరకక బయట ఎంతో మంది ఆకలితో అలమటిస్తున్నారు. దాన్ని వృథా చేయకూడదు" అంది ఎంతో జాలిగా.ఒకపక్క ఆకలితో అలమటించే నిరుపేదలు, మరోపక్క మిగిలిపోయిన తిండిని ఏం చేయాలో తెలియక పారేసే స్థితిమంతులు. దేశం రాకెట్ ల ముందుకు వెళ్తోంది కానీ, ఇప్పటికీ ఆకలితో అలమటించే వాళ్లు ఉంటూనే ఉన్నారు. ఒకవైపు తిండి ఎక్కువై పారేసేవాళ్లు ఉంటే... ఇంకోవైపు కనీసం ఒక్క పూట గంజి దొరికినా చాలు అనుకునే అభాగ్యులు ఉన్నారు. మనం తినే ప్రతి మెతుకు మీద మన పేరు రాసి ఉంటుందని పెద్దలు అంటారు అన్నయ్యా! కానీ, పొగరు పట్టి ఆ దేవుడు రాసిన అన్నాన్ని అలా కాళ్లతో తన్నే వాళ్లు కూడా ఈ