వెంటాడే నీడలు ( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పారానార్మల్ థ్రిల్లర్) కొట్ర శివ రామ కృష్ణ "సరే రాజూ. ఇంతకీ ఇప్పుడు విషయం ఏమిటి? నాకు ఎందుకు సడన్గా ఇలా అయింది? ఆ వివరాలు కొంచెం తెలిస్తే చెప్పు." "మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలానే వున్నాయి. మీరు నాకూడా నేనుండే చోటికి వచ్చినా సరే, లేదూ మీరే నన్ను మీరు ఉండేచోటికి తీసుకువెళ్లినా సరే. " "నేనుండే చోట్లోనే కొంతకాలం పాటు కదలకుండా విశ్రాంతి తీసుకోవాలన్నది నా ఆలోచన. కాసేపట్లో ఇక్కడికి వచ్చే ఫ్లైట్లో నేను నా ఇల్లు వుండే టౌన్ కి వెళ్ళిపోతున్నాను." "నేనూ ఇదే ఫ్లైట్లో మీరు వెళ్లే టౌన్ కి టికెట్ తీసుకునే వున్నాను." తన జేబులోనుండి టికెట్ తీసి చూపించాడు రాజు. "నాకైతే మీ కూడా రావడానికి ఎటువంటి ఇబ్బందీ లేదు." "నువ్వు చాలా ప్రెపేర్డ్ గా ముందుచూపుతో వున్నావు." నవ్వాడు