Part - 1102-జులై-2018మద్యాహ్నం 2:10 గంటలునిత్యం పర్యాటకుల సందడితో కళకళలాడే కృష్ణానదిపై ఉన్న భవాని ఐలాండ్ రిసార్ట్‌లో...ఒక చోట పాత స్నేహితుల కలయికలతో, నవ్వులతో, జ్ఞాపకాల ముచ్చట్లతో ఒక సమూహం సందడిగా గడుపుతోంది.వాళ్లంతా పదమూడు సంవత్సరాల క్రితం ఒకే పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు.కాలం వారిని వేర్వేరు దారుల్లో నడిపించినా.ఆ రోజు మాత్రం మళ్లీ ఒకేచోటికి తీసుకొచ్చింది.వాళ్ళలొ కొందురు వ్యాపారవేత్తలయ్యారు,కొందరు ఉద్యోగుస్తులయ్యారు,కొందరు విదేశాల్లో స్థిరపడ్డారు,మరికొందరు కుటుంబ జీవితంలో మునిగిపోయారు.కాని ఒకరు మాత్రం మిగతావాళ్ళలా ఉత్సాహంగా లేరు. చేతిలొ ఒక జ్యూసు గ్లాస్, మొఖపై బలవంతపు చిరునవ్వు,కాని మనసు మాత్రం ఎక్కడో ఉండి.వాళ్ళతొ తనకు సంబంధం లేనట్టుగా ప్రక్కన ఒక మూలన నిలబడి ఉంది. "హే తులసి. ఏం చేస్తున్నవె ఒక్కదానివె ఇక్కడ నించోని" అని తన స్నేహితురాలు పల్లవి వచ్చి అడిగంది.ప్రక్కన నించున్న పల్లవి వైపు తిరిగి చిన్న చిరు నవ్వు నవ్వింది గాని సమాధానం చెప్పలేదు.పల్లవి : ఏం ఆలోచిస్తున్నావె ...?తులసి : ఏం లేదు