**రామ్** బైక్‌పై వెళుతూ ఉంటే, సడన్‌గా కొంతమంది రౌడీలు వచ్చి అతన్ని ఆపుతారు. ఒక డివైస్ కోసం రామ్ అప్పు చేసి దామోదర్‌కు డబ్బులు ఇచ్చి ఉంటాడు. నెల రోజులైనా వడ్డీ, డబ్బులు ఇవ్వకపోవడంతో వాళ్లు అతని వెంటపడి పట్టుకుంటారు. దొరికిన వెంటనే వాళ్లందరూ రామ్‌ను చుట్టుముడతారు. "ముప్పై వేల రూపాయల కోసం నెలరోజులు ముప్పుతిప్పలు పెడుతున్నావు! గంటసేపు గట్టిగా పని చేస్తే వచ్చే డబ్బులకు నెల రోజులు ఎలా రా? సిగ్గు లేకుండా ఎలా తిరుగుతున్నావ్? బండి ఆపు, ఎత్తుకొని పోతాం. డబ్బులు ఇచ్చి తీసుకువెళ్ళు" అని మీదకు వస్తారు. వాళ్ళు బండి కంటే ముందు, రామ్ దగ్గర ఉన్న డివైస్‌ను లాక్కోవడానికి ప్రయత్నిస్తారు. రామ్ దాన్ని గట్టిగా పట్టుకుంటాడు. "బండి తీసుకొని వెళ్తానన్నావు కదా, మళ్లీ దీని జోలికి ఎందుకు? వదిలేసి వెళ్ళిపో" అంటాడు. కానీ వాళ్లలో ఇద్దరు ముగ్గురు, "ఏంరా.. సార్ గారికి కోపం వస్తోంది! అప్పు