పాదం నిలిచిన చోటు

  • 114

నవంబర్ నెల సాయంత్రం... హైదరాబాద్ నగరపు ఆకాశం నెమ్మదిగా నారింజ రంగులోకి మారుతోంది. ట్రాఫిక్ రణగొణ ధ్వనులు, ఆఫీసుల నుండి ఇళ్లకు వెళ్లే వారి హడావిడి, రోడ్ల పక్కన వెలుగుతున్న రంగురంగుల నియాన్ బోర్డులు... ఇవన్నీ ఆ నగరానికే సొంతమైన ఒక ప్రత్యేకమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి.ట్రెండ్స్, పుమా, జాకీ లాంటి పెద్ద పెద్ద బ్రాండెడ్ షోరూమ్స్, విభిన్న రకాల రెస్టారెంట్స్ తో ఉన్న ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ అది. వాటి పైన రెండు పోష్ అపార్ట్మెంట్స్ ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నట్లుగా ఉన్నాయి. కింద ముందర భాగంలో ఒక ఛాయ్ పాయింట్, కుంభకోణం కాఫీ లాంటి చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. సాయంత్రం ఆ ప్లేస్ చాలా మంది యంగ్ పీపుల్ తో నిండిపోయి ఉంటుంది. ముందర కూర్చోవడానికి వీలుగా కొన్ని టేబుల్స్, అరుగులు ఏర్పాటు చేశారు. రోస్ట్ చేసిన కాఫీ గింజల సువాసన ఆ చుట్టుపక్కల గాలిలో ఒక రకమైన