శీర్షిక: పొద్దుతిరుగుడు పువ్వు సూర్యుడి వైపే ఎందుకు తిరుగుతుంది? దాని వెనుక ఉన్న ఒక అందమైన, నిస్వార్థమైన ప్రేమ కథ... నా ఊహల్లోంచి వచ్చిన చిన్న ప్రయత్నం."కథ : నిస్వార్థ ప్రేమానురాగం – పొద్దుతిరుగుడు జన్మరహస్యంఒకానొక పూర్వకాలంలో, ప్రకృతి ఒడిలో పరవశిస్తూ ఉన్న ఒక సుందరమైన నందనవనం ఉండేది. ఆ తోటలో ఎన్నో రకాల రంగురంగుల పూల మొక్కలు, గుబాళించే సువాసనలు వెదజల్లే పుష్పాలు ఉండేవి. ఒక్కొక్క పువ్వు కు ఒక్కొక్క ప్రత్యేకం ఉండేది. ప్రతి పువ్వు లోన ఏదో ఆకర్షణ ఉండేది. అలాంటి పువ్వుల మధ్యలో ఈ పువ్వు ఎంతో ప్రత్యేకమైన, అందమైన పుష్పం నివసిస్తూ ఉండేది. ఆ పువ్వుకు ఒక వింతైన అలవాటు, అంతకుమించిన అమాయకమైన మనసు ఉండేవి. తోటలోని మిగిలిన పూలన్నీ తమ అందాన్ని చూసుకుని మురిసిపోతుంటే, ఈ పువ్వు మాత్రం ప్రతిరోజూ ఉదయాన్నే ఆకాశంలో ఉదయించే సూర్యభగవానుడిని చూస్తూ పరవశించిపోయేది.సూర్యుడు తూర్పున ఉదయించిన క్షణం నుండి సాయంత్రం